Budhaditya Yoga: జ్యోతిషశాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిచక్రాన్ని మారుస్తాయి. కొన్ని సార్లు రెండు గ్రహాలు ఒకే రాశిలో కలవడం వల్ల అరుదైన యోగాలు ఏర్పడుతాయి. దీని ప్రభావం ప్రజలందరిపై ఉంటుంది. ఈనెల 13న గ్రహాల యువరాజైన బుధుడు వృశ్చికరాశిలో సంచరించనున్నాడు. మరో మూడు రోజుల వ్యవధిలో సూర్యభగవానుడు కూడా అదే రాశిలోకి ప్రవేశించనున్నాడు. వృశ్చికరాశిలో ఈరెండు రాశుల కలయిక వల్ల  బుధాదిత్య రాజయోగం (Budhaditya Yoga) ఏర్పడుతుంది. ఈయోగం కొన్ని రాశులవారికి అపారమైన ప్రయోజనాలను ఇవ్వనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుధాదిత్య రాజయోగం ఈ రాశులకు వరం
తుల రాశి (Libra): బుధాదిత్య రాజయోగం తుల రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి రెండవ ఇంట్లో ఈ రాజయోగం ఏర్పడబోతోంది. దీంతో మీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు. అంతేకాకుండా వృత్తి మరియు వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. సూర్యభగవానుడు ప్రభావం కారణంగా పనిలో విజయం సాధించే అవకాశం ఉంది. ఉపాధ్యాయులు, మార్కెటింగ్, మీడియా రంగానికి సంబంధించిన వ్యక్తులు ఈ సమయంలో లాభపడతారు. 


మకర రాశి (Capricorn): బుధాదిత్య రాజయోగం వల్ల మకరరాశివారు వృత్తి, వ్యాపారాలలో విజయం సాధిస్తారు. మీరు అనేక వనరుల నుండి డబ్బును పొందుతారు. వ్యాపారంలో పెద్ద డీల్ ను కుదుర్చుకోవచ్చు. పార్టనర్ షిప్ తో పనిచేసే వ్యాపారులకు ఈ యోగం శుభప్రదంగా ఉంటుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వ్సతుంది. 


మీన రాశి (Pisces): ఈ రాశి యెుక్క జాతకంలోని తొమ్మిదవ ఇంట్లో బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. దీంతో మీ అదృష్టం ప్రకాశించి ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. మీరు వ్యాపార నిమిత్తం టూర్ కు వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందే అవకాశం ఉంది. అలాగే రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన వివాదాలు పరిష్కరించబడతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. రాజకీయాల్లో ఉన్నవారికి ఈ సమయం కలిసి వస్తుంది. 


Also Read: Budh Gochar 2022: ధనస్సు రాశిలోకి తిరోగమన బుధుడు... ఈరాశులకు కష్టాలే కష్టాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link https://bit.ly/3P3R74U    


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook