Mercury Transit 2023: ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో రాశి మారినట్టే బుధ గ్రహం మేషరాశిలో అస్తమించనున్నాడు. గ్రహాల రాశి ప్రవేశం కంటే అస్తమించడం ఎక్కువ ప్రభావం చూపిస్తుంటుంది. అదే విధంగా బుధగ్రహం మేషరాశిలో అస్తమించడం వల్ల ఈ రాశివారికి అంతులేని ధనలాభం కలగనుంది. ఇంకా చాలా ప్రయోజనాలు చేకూరనున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహానికి మహత్యముంది. బుధుడిని గ్రహాలకు రాజకుమారుడిగా పిలుస్తారు. ఏప్రిల్ 23వ తేదీ మేషరాశిలో వక్రమార్గం పట్టనున్నాడు బుధుడు. ఈ ప్రభావం చాలా రాశుల జీవితాలపై శుభ, అశుభ పరిణామాలకు దారి తీయనుంది. బుధుడు అస్తమించడం వల్ల ఆరోగ్యం, వ్యాపారం, ఉద్యోగంతో పాటు వివిధ రంగాల్లో అభివృద్ధి తప్పకుండా కన్పిస్తుంది. బుధుడు మేష రాశిలో ప్రవేశించడం వల్ల చాలా రాశుల జీవితాలపై అత్యంత శుభసూచకంగా ఉంటుంది.


బుధుడి అస్తమయం ప్రభావం 


తులా రాశి


మేష రాశి అస్తమయం తులారాశి 7వ పాదంలో జరగనుంది. బుధుడు 9వ, 12వ పాదాలకు అధిపతి కావడంతో ఈ రాశివారికి బుధుడి అస్తమయం మిశ్రమ ఫలితాలు అందించనుంది. ఆధ్యాత్మిక ప్రయాణాలు చేయవచ్చు. ఉద్యోగమార్పు కోసం ఆలోచిస్తుంటే నిరీక్షిస్తే ఫలితాలుంటాయి. ఈ సమయంలో పనిచేసే చోట ప్రశంసలు లభిస్తాయి. పదోన్నతి, ఇంక్రిమెంట్లు ఉంటాయి. స్నేహితులతో  వివాదం ఏర్పడకుండా జాగ్రత్త పడండి. లేకపోతే సమస్యలు ఎదుర్కోవల్సివ్తుంది.


కుంభ రాశి


జ్యోతిష్యం ప్రకారం కుంభరాశి 5వ, 8వ పాదాలకు అధిపతి. కానీ బుధుడు కుంభరాశి మూడవ పాదంలో ఆస్తమించనున్నాడు. ఫలితగా సాహసం, ఆత్మ విశ్వాసానికి ప్రతీకగా భావిస్తారు. ఈ పరిస్థితుల్లో ఈ రాశి జాతకులకు ఉద్యోగావకాశాలు, విజయం లభిస్తాయి. ఈ క్రమంలో ప్రత్యర్ధులకు గట్టి పోటీ ఉంటుంది. ఆర్ధిక పరిస్థితి మిశ్రమంగా ఉంటున్నందున అప్రమత్తంగా ఉంటే మంచిది. ఖర్చుల్ని నియంత్రించుకోవాలి. 


Also read: Surya Grahan 2023: సూర్యగ్రహణం నాడు అశుభ యోగం.. ఈ 5 రాశులవారికి నరకం..


కన్యా రాశి


జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ రాశి 8వ పాదంలో బుధుడు అస్తమించనున్నాడు. ఈ రాశి జాతకులకు అదృష్టం పూర్తిగా తోడై నిలుస్తుంది. ఉద్యోగం, వ్యాపారం ఊహించనిరీతిలో అభివృద్ధి చెందుతుంది. ఖర్చులు అకారణంగా పెరిగిపోతాయి. జాగ్రత్తగా ఉంటే మంచిది. ఆదాయానికి కొత్త మార్గాలు తెర్చుకుంటాయి.


Also read: Jupiter Transit 2023: గురువు మేషరాశి ప్రవేశం, ఆ ఒక్క రాశికి ఏడాదిపాటు ఎలా ఉంటుందో తెలుసా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook