Mercury Combust in Aries on April 23rd 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం బుధగ్రహాన్ని బుద్ధి, తర్కం, శక్తికి ప్రతీకగా భావిస్తారు. ఏప్రిల్ 23వ తేదీన బుధుడు మేష రాశిలో అస్తమించనున్నాడు. ఫలితంగా మొత్తం 12 రాశులపై ప్రభావం పడినా 4 రాశులపై మాత్రం తీవ్ర ప్రతికూలం కానుంది. ఒక్కసారిగా కష్టాలన్నీ మీదపడనున్నాయి. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్రహాల రాజకుమారుడు బుధుడు ఈ నెల 23వ తేదీన అంటే మరో పదిరోజుల్లో మేష రాశిలో అస్తమించనున్నాడు. దీని ప్రభావం ఊహించినట్టే తీవ్ర ప్రతికూలంగా ఉండనుంది. ముఖ్యంగా నాలుగు రాశుల జాతకాలకు తీవ్ర సమస్యలు వెంటాడనున్నాయి. ఉద్యోగ, వ్యాపారాలన్నీ నష్టపోతారు. ఆరోగ్యం విషయంలో , పనిచేసేచోట ప్రతికూల పరిణామాల్ని ఎదుర్కోవల్సి వస్తుంది. ముఖ్యంగా నిద్రలేమి, ఆకలి తగ్గిపోవడం, నిర్ణయాలు తీసుకోలేకపోవడం వంటి సమస్యలు ఎదురౌతాయి. బుధుడు అస్తమించడం వల్ల 4 రాశులపై అన్నింటికంటే తీవ్ర ప్రభావం పడనుంది. బుధుడి అస్తమయం ప్రభావం ఏ రాశులపై ఎలా ఉంటుందో వివరంగా పరిశీలిద్దాం.


సింహ రాశి:


బుధుడు అస్తమించే ప్రభావంంతో సింహ రాశి జాతకంపై ఆర్ధికపరంగా నష్టాలు ఎదురౌతాయి. ఆర్ధిక పరిస్థితి తలకిందులై ఖర్చులు పెరిగిపోతాయి. ఆర్ధికపరమైన నిర్ణయాలు తప్పుగా పరిణించవచ్చు. సుదూర ప్రయాణాల సమయంలో ధనహాని కలగవచ్చు. దురదృష్టం వెన్నాడుతుంటుంది. మీరు కలలుగన్న కోర్కెలు నెరవేరవు. ఎంతో కష్టపడినా సరే ప్రతిఫలం దక్కదు. తీవ్ర ఒత్తిడికి లోనవడం వల్ల సమస్యలు ఎదురౌతాయి.


వృషభ రాశి:


బుధగ్రహం అస్తమించడం వల్ల ఈ రాశి జాతకులు నష్టపోవల్సి వస్తుంది. ఎంత కష్టపడినా అభివృద్ధి కన్పించదు. అంటే ఏ పనిలోనూ పురోగతి ఉండదు. మీ ఖర్చులు అమాంతంగా పెరిగిపోతాయి. కుటంబసభ్యులతో వివాదం రావచ్చు. జీవిత బాగస్వామితో సంబంధాలు చెడిపోయే ప్రమాదముంది. అందరూ ఉన్నా సరే ఒంటరితనం ఫీలవుతారు. ఆర్ధికంగా ఇబ్బందులు తప్పవు.


Also Read; Grahana Yogam 2023: సూర్య, రాహువుల యుతి, 3 రాశులకు ఏప్రిల్ 14 నుంచి తీరని కష్టాలు తప్పవా


కన్యా రాశి:


బుధగ్రహం మేష రాశిలో అస్తమించడంతో కన్యారాశి జాతకంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. వ్యాపారంలో నష్టాలు కలుగుతాయి. వ్యాపారస్థులు పోటీ ఎదుర్కోవల్సి ఉంటుంది. కెరీర్ పరంగా తీవ్ర అసంతృప్తి ఉంటుంది. ఫలితంగా దుఖాలు ఎదురౌతాయి. ఆరోగ్యపరంగా సమయం ప్రతికూలంగా ఉంటుంది. పంటి సమస్యలు బాధిస్తాయి. కొత్త వ్యాపారం కోసం ఆలోచిస్తుంటే వాయిదా వేయడం మంచిది. 


కర్కాటక రాశి:


బుధుడు మేషరాశిలో అస్తమించనుండటం కర్కాటక రాశి జాతకులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. పనిచేసేచోట సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. ఆర్ధికంగా ఇబ్బందులు ఎదురౌతాయి. ఆరోగ్యం బాగుండదు. వివిధ రకాల సమస్యలు వెంటాడుతాయి. ఉద్యోగం కోల్పోయే ప్రమాదముంది. 


Also Read; Magal Gochar 2023: కుజ సంచారం 2023.. మే 10 నుంచి ఈ 4 రాశుల వారికి రాజయోగం! డబ్బేడబ్బు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook