Budh Margi 2024 effect: హిందూ క్యాలెండర్ ప్రకారం, గ్రహాల రాకుమారుడైన బుధుడు రేపు అంటే జనవరి 02, ఉదయం 08.06 గంటలకు వృశ్చికరాశిలో ప్రత్యక్షంగా సంచరించనున్నాడు. పురాణాల ప్రకారం, చంద్రుడు కుమారుడు బుధుడు. ఏ వ్యక్తి జాతకంలో మెర్క్యూరీ శుభస్థానంలో ఉంటాడో వారికి దేనికీ లోటు ఉండదు. వీరికి తెలివితేటలతో పాటు డబ్బుకు కొదవ ఉండదు. మీ కుండలిలో బుధుడు అశుభస్థానంలో ఉంటే మీరు చాలా సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. మీరు జాతకంలో బుధుడు బలపడాలంటే మెుత్తం 12 రాశులవారు ఈ చర్యలు తీసుకోవాలి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం: మేష రాశి వారు నపుంసకులకు గౌరవం ఇవ్వండి. నపుంసకులు ఆకుపచ్చ రంగు దుస్తులను దానం చేయాలి.
వృషభం: విద్యార్థులకు, పేద పిల్లలకు పుస్తకాలు పంచండి. వీలైతే వారి చదువుకు సహాయం చేయండి.
మిథునరాశి: ఈ రాశి వ్యక్తులు రోజూ తులసి మెుక్కను పూజించి..దీపం వెలిగిస్తే బుధుడు అనుగ్రహిస్తాడు.  
కర్కాటకం: ఈ రాశి వారు "ఓం నమో భగవతే వాసుదేవాయ్" అని రోజూ 108 సార్లు జపించాలి.
సింహం: తులసి మొక్కకు రోజూ నీళ్లు పోయండి.  వీలైతే ఒక తులసి ఆకు తినండి.
కన్య: బుధవారం నాడు పచ్చ రత్నాన్ని ధరించడం వల్ల మేలు జరుగుతుంది. 
తులారాశి: ఈ రాశి వారు తులసి మొక్కకు రోజూ నీరు పోసి.. తులసి ఆకును తినండి.  


Also Read: Career Horoscope 2024: 2024లో కెరీర్‌ పరంగా ఊహించని లాభాలు పొందబోయే రాశులవారు వీరే!


వృశ్చికం: నిరుపేద పిల్లలకు, విద్యార్థులకు పుస్తకాలు దానం చేయండి. పేద పిల్లలకు చదువులో సహాయం చేయండి.
ధనుస్సు: విద్యార్థులకు మరియు పేద పిల్లలకు పుస్తకాలను దానం చేయండి. తులసికి రోజూ నీళ్ళు సమర్పించండి.
మకరం: ప్రతిరోజూ ఆవుకు మేత వేయండి. అంతేకాకుండా ఆవును పూజించండి.
కుంభం: ఇంట్లో, ఆఫీసులో మెర్క్యురీ యంత్రాన్ని పెట్టుకోవడం వల్ల మేలు జరుగుతుంది. 
మీనం: బుధవారం వినాయకుడిని పూజించి.. గణేష్ చాలీసా పఠించండి. దేవుడికి దూర్వా గడ్డిని సమర్పించండి.


Also Read:Horoscope 2024: 2024లో అత్యంత అదృష్టం కలిగిన రాశి ఫలాలు..ఇందులో మీ రాశి కూడా ఉందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter