Budh Gochar 2023: తెలివితేటలు, విద్య, వ్యాపారం మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ కు కారకుడిగా బుధుడిని భావిస్తారు. ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తున్న మెర్క్యూరీ ఈనెల 31 మధ్యాహ్నం 02.44 గంటలకు మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. బుధుడు మేషరాశి ప్రవేశం కొందరికి సానుకూలంగా ఉంటే, మరికొందరికి ప్రతికూలంగా ఉండనుంది. మెర్క్యూరీ సంచార సమయంలో ఏయే రాశులవారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశులవారికి సమస్యలు
వృషభం - వృషభ రాశి యెుక్క రెండవ మరియు ఐదవ గృహాలకు బుధుడు అధిపతి. మెర్క్యూరీ గోచారం వల్ల మీరు చెడు వ్యసనాలవైపు ఆకర్షితులవుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. చదువులో రాణించలేకపోవచ్చు. మీరు ఆర్థిక సమస్యలు ఎదుర్కోంటారు. సమాజంలో మీ గౌరవం దెబ్బతింటుంది. 
కర్కాటకం- బుధగ్రహ సంచారం వల్ల కర్కాటక రాశి వారు ఆఫీసులో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. మీ ప్రతిష్ట దెబ్బతింటుంది. మీరు ఒత్తిడికి గురవుతారు. ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఉంది. ఈ సమయం మీకు చాలా కష్టంగా ఉంటుంది.


కన్యారాశి- ఈ సమయంలో కన్యారాశి వారి ఆర్థిక పరిస్థితి మరింత దిగజారవచ్చు. మీరు ఉద్యోగాలను మార్చడానికి ప్రయత్నిస్తున్నట్లయితే ఇది సరైన సమయం కాదు. ఆఫీసులో అనవసరమైన గాసిప్‌లకు దూరంగా ఉండండి, లేకుంటే మీ ఇమేజ్ దెబ్బతింటుంది. వ్యాపారం చేసేవారు తెలివిగా ఫ్లాన్ చేసుకుంటే తప్ప లాభాలు రావు. ఈ సమయంలో మీరు చాలా సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. 
కుంభం- బుధ సంచారం కారణంగా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ తో విభేదాలను ఎదుర్కోంటారు. మీ జాతకంలో బుధుని స్థానం అననుకూలంగా ఉంటే, మీకు కష్టాలు మరింత పెరగవచ్చు. కొత్త ప్రాజెక్ట్‌లో జాప్యం జరగవచ్చు. ఆర్థికంగా నష్టాలను చవిచూస్తారు. పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. సొంతంగా వ్యాపారం చేసే వారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 


Also Read: Guru Rahu yuti 2023: ఏప్రిల్ లో అశుభకరమైన యోగం చేయబోతున్న గురుడు-రాహువు.. ఈ 3 రాశులకు కష్టాలే కష్టాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook