Budh Margi 2023: బుధుడి ప్రత్యక్ష కదలికతో ఈ రాశులకు ఊహించని అదృష్టం, ఐశ్వర్యం.. మీరున్నారా?
Mercury Margi 2023: గ్రహాల రాకుమారుడైన బుధుడు ప్రస్తుతం మేషరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. త్వరలో మెర్క్యురీ ప్రత్యక్ష కదలిక ప్రారంభం కానుంది. బుధుడి సంచారం ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం.
Budha Margi 2023 effect: జ్యోతిషశాస్త్రంలో బుధుడిని గ్రహాల యువరాజు అని పిలుస్తారు. బుధ గ్రహం మేధస్సు, తర్కం, కమ్యూనికేషన్ కు కారకుడిగా భావిస్తారు. జాతకంలో బుధుడు శుభప్రదంగా ఉంటే.. ఆ వ్యక్తి పెద్ద వ్యాపారవేత్త అవుతాడు. తన తెలివితేటలతో ప్రతి సమస్యను సులువుగా పరిష్కరిస్తాడు. ప్రస్తుతం బుధుడు మేషరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. మే 15, 2023న మెర్క్యురీ గ్రహం యెుక్క ప్రత్యక్ష కదలిక మెుదలుకానుంది. మెర్క్యురీ ప్రత్యక్ష సంచారం ఏయే రాశులవారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.
మేషం: బుధుడి ప్రత్యక్ష కదలిక వల్ల మీ జ్ఞానం పెరుగుతుంది. ఈ సమయం వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. మీరు కొత్త ఇంటిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది.
వృషభం: బుధ సంచారం కారణంగా వృషభ రాశి వారు కొత్త ఇంటిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు ఆస్తికి సంబంధించిన ప్రయోజనాలను పొందుతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ కూడా లభిస్తుంది.
కర్కాటకం: బుధుని ప్రత్యక్ష సంచారం కర్కాటక రాశి వారికి గౌరవాన్ని ఇస్తుంది. మీ పనికి ప్రజల ప్రశంసలు లభిస్తాయి. కుటుంబం సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది.
Also Read: Shani Dev Effects 2023: ఈ 5 రాశుల వారిపై శనిదేవుడి చెడు దృష్టి.. ఇందులో మీరున్నారా?
కన్య: బుధుడి మార్గం కన్యా రాశి వారికి మేలు చేస్తుంది. మీ బిజినెస్ విస్తరిస్తుంది. ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. మీరు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.
ధనుస్సు: బుధుని ప్రత్యక్ష సంచారం ధనుస్సు రాశి వారికి కీర్తి ప్రతిష్టలను ఇస్తుంది. మీకు పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్న వక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇది మీకు భవిష్యత్తులో మంచి ప్రయోజనాలను ఇస్తుంది.
Also Read: Surya Chandra Yuti 2023: త్వరలో వృషభ రాశిలో అశుభకరమైన 'అమావాస్య దోషం'... ఈ 3 రాశుల వారు జాగ్రత్త..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook