Mercury Margi 2024: ఈరోజు నుంచి ఈ 3 రాశులకు మంచి రోజులు.. ఇందులో మీ రాశి ఉందా?
Mercuyr Margi 2024: ఇవాళ బుధుడు గమనంలో కీలక మార్పు చోటుచేసుకోబోతుంది. మెర్క్యూరీ వృశ్చిక రాశిలో ప్రత్యక్షంగా సంచరించబోతున్నాడు. దీంతో మూడు రాశులవారు బంపర్ బెనిఫిట్స్ పొందబోతున్నారు.
Budh Gochar in January 2024: పంచాంగం ప్రకారం, ఈరోజు గ్రహాల రాకుమారుడైన బుధుడు వృశ్చిక రాశిలోకి డైరెక్ట్ గా కదలనున్నాడు. సాధారణంగా గ్రహాల ప్రత్యక్ష సంచారం శుభఫలితాలను ఇస్తుంది. ఆస్ట్రాలజీ ప్రకారం, తెలివితేటలు, వ్యాపారం మరియు స్కిల్స్ కారకుడిగా బుధుడిని పేర్కొంటారు. ఏ వ్యక్తి జాతకంలో బుధుడు బలమైన స్థానంలో ఉంటారో వారికి దేనికీ లోటు ఉండదు. మెర్క్యూరీ ప్రత్యక్ష సంచారం వల్ల ఏయే రాశులవారు ప్రత్యేక ప్రయోజనాలు పొందబోతున్నారో తెలుసుకుందాం.
కన్య రాశి
వృశ్చిక రాశిలో బుధుడు ప్రత్యక్ష సంచారం కన్యా రాశి వారికి మేలు చేస్తుంది. మీరు కెరీర్ లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. జాబ్ సాధించాలనే మీ కోరిక నెరవేరుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీ దారిద్య్రం పోతుంది. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. మీ బిజినెస్ డెవలప్ అవుతుంది. వ్యాపారస్తులు మంచి లాభాలను పొందుతారు. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది.
తులారాశి
బుధుడి ప్రత్యక్ష సంచారం జనవరి నెలలో తులారాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. మీ సంపాదన పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తొలగిపోతాయి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ విపరీతంగా పెరుగుతుంది. మీ లవ్ సక్సెస్ అవుతుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. వ్యాపారులు భారీగా లాభాలను ఆర్జిస్తారు. అంతేకాకుండా బిజినెస్ వృద్ధి చెందుతుంది.
Also read: Lucky Zodiac Signs: 50 ఏళ్ల తర్వాత 3 రాజయోగాలు.. జనవరిలో ఈ 3 రాశులవారిపై డబ్బు వర్షం..
సింహరాశి
మెర్క్యూరీ రాశి మార్పు సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీ వ్యాపారం బాగా విస్తరిస్తుంది. మీరు మరిన్ని బ్రాంచ్ లు ఓపెన్ చేసే అవకాశం ఉంది. మీరు ఆర్థికంగా లాభాలను పొందుతారు. మీరు విద్య, ఉద్యోగ లేదా వ్యాపార నిమిత్తం ఫారిన్ కు వెళ్లే అవకాశం ఉంది. మీరు రుణ విముక్తి నుండి బయటపడతారు.
Also read: Shani Impact In 2024: 2024లో శని దుష్ప్రభావం, అనుగ్రహం చూపబోయేది ఈ రాశుల వారి పైనే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter