Shani Impact In 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహం సంఖ్య 4.. కాబట్టి ఈ సంవత్సరం 2024 కావడం వల్ల సంవత్సరం మొత్తం శని ప్రభావం ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ సంవత్సరం పొడవునా రాహు కేతువుల ప్రభావం కూడా ఏడాది పొడవునా ఉంటుంది. అలాగే చంద్రుడు సింహరాశిలో ఉంటాడు. ఇలా అన్ని గ్రహాలు రాశుల్లో ప్రత్యేక స్థానాల్లో ఉండబోతున్నాయి. కొన్ని జాతకాలపై శని ఆధిపత్యం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా జనవరి నెలలో శని సాడే సతితో బాధపడుతున్న వారికి చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. ఇలా మొత్తం 5 నెలల పాటు శని కొన్ని రాశులపై దుష్ప్రభావాన్ని చూపే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే 2024 సంవత్సరంలో శని గ్రహం కారణంగా ఏ ఏ రాశుల వారికి మంచి జరుగుతుందో ఏ ఏ రాశుల వారికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయే మనం ఇప్పుడు తెలుసుకుందాం.
2024లో గ్రహ స్థితి:
ఈ సంవత్సరం కుంభరాశిలో శని ఉండబోతున్నాడు.. అంతేకాకుండా కొన్నికొన్ని సందర్భాల్లో శని గ్రహం తిరోగమనం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. బృహస్పతి మొదట మేషరాశిలో సంచారం చేసి ఆ తర్వాత వృషభ రాశిలోకి ప్రవేశిస్తుంది. రాహు మీనరాశిలో కేతువు కన్య రాశిలో ఉంటాడు. మరికొన్ని గ్రహాలు ప్రతినెల రాశి సంచారం చేస్తూనే ఉంటాయి.
2024లో ఎవరికి లాభం?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారిపై శని శుభప్రభావాన్ని చూపబోతోంది. ముఖ్యంగా మేష మిధున, కన్య, ధనస్సు రాశి వారికి శని గ్రహం ప్రత్యేక అనుగ్రహాన్ని అందించబోతోంది. దీనికి కారణంగా ఈ రాశుల వారు 2024 సంవత్సరంలో ఊహించని లాభాలు పొందుతారు.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
ఈ రాశుల వారిపై దుష్ప్రభావం:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కర్కాటకం తుల కుంభ రాశి వారు తప్పకుండా ఈ సంవత్సరంలో పలు రకాలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది అంతేకాకుండా జీవనశైలిలో మార్పులు, చెడు ఆహార అలవాట్లను వదులుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
శని దుష్ప్రభావంతో బాధపడేవారు తప్పకుండా 2024 సంవత్సరంలో ఐరన్ వస్తువులతో తయారుచేసిన దండను ధరించడం చాలా మంచిది అంతే కాకుండా ప్రతి శనివారం శనీశ్వరుడిని ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయడం చాలా శుభప్రదం అంతేకాకుండా శని దేవుడి ముందు తప్పకుండా నువ్వుల నూనెతో దీపం వెలిగించి శని శని మంత్రాన్ని జపించాల్సి ఉంటుంది. వీలైనంతవరకు ప్రతి శనివారం మాంసాహారం, మద్యపానానికి దూరంగా ఉండాలి.