Budh Margi 2022: బుధ గ్రహం.. మేధస్సు, సంపద, వ్యాపారానికి కారకుడు. ప్రస్తుతం కన్యారాశిలో బుధుడుతిరోగమనంలో ఉన్నాడు. అక్టోబరు 2న బుధుడు కదలికలోకి (Budh Margi 2022) వస్తాడు. దీని తర్వాత అక్టోబర్ 3న మహా అష్టమి, అక్టోబర్ 4న మహా నవమి మరియు అక్టోబర్ 5న దసరా. నవరాత్రులలో బుధ గ్రహం యొక్క సంచారం 5 రాశుల వారికి అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తుంది. వీరు కెరీర్ లో పురోగతితోపాటు అపారమైన డబ్బును పొందుతారు. ఏయే రాశులవారికి బుధుడు శుభఫలితాలను ఇస్తాడో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి (Aries)- బుధుని మార్గం మేష రాశి వారికి చాలా లాభాన్ని ఇస్తుంది. వీరి కెరీర్‌లో మంచి రోజులు మొదలవుతాయి. పదోన్నతి, జీతం పెరగడానికి బలమైన అవకాశాలు ఉన్నాయి. కొత్త జాబ్ వస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. 
వృషభం (Taurus)- కన్యారాశిలో బుధుని ప్రత్యక్ష సంచారం వృషభ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరు ఆకస్మిక ధనలాభాలను పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. 
కన్య (Virgo)- ఈ రాశిలోనే బుధుడి సంచారం జరుగుతుంది కాబట్టి ఈ రాశివారు కెరీర్ లో అనుకున్న విజయాన్ని సాధిస్తారు సమాజంలో గౌరవం పెరుగుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
వృశ్చిక రాశి (Scorpio)- బుధగ్రహం ప్రత్యక్ష సంచారం వల్ల వృశ్చిక రాశి వారికి విశేష లాభాలు కలుగుతాయి. వ్యాపారులు భారీగా లాభాలను అందుకుంటారు. వృత్తిలో పురోగతి సాధిస్తారు. ఇరక్కుపోయిన డబ్బు మీకు అందుతుంది. 
మకరం (Capricorn)- బుధుడు యొక్క మార్గం మకర రాశి వారికి అపారమైన ప్రయోజనాలను అందిస్తుంది. అమ్మకాలు పెరుగుతాయి. లాభాలు మెండుగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులు శుభవార్తలు వింటారు.  


Also Read: Guru Margi 2022: నవంబరులో దేవగురు సంచారం.. ఈ రాశులవారిపై కనకవర్షం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.       


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu       


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook