Guru Margi 2022: నవంబరులో దేవగురు సంచారం.. ఈ రాశులవారిపై కనకవర్షం..

Guru Margi 2022: మీనరాశిలో నవంబర్ 24న బృహస్పతి సంచరించనున్నాడు. దీని ప్రభావం 4 రాశులవారిపై సానుకూలంగా ఉండనుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 29, 2022, 11:50 AM IST
Guru Margi 2022: నవంబరులో దేవగురు సంచారం.. ఈ రాశులవారిపై కనకవర్షం..

Guru Margi 2022: ఆస్ట్రాలజీ ప్రకారం, గ్రహాల మార్పులు మనుషులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. దీపావళి తర్వాత దేవగురు బృహస్పతి (Devguru Brihaspati) ప్రత్యక్ష సంచారం ప్రారంభం కానుంది. జూలై 29న బృహస్పతి మీనరాశిలో తిరోగమనం చెందింది. నవంబరు 24 వరకు అదే స్థితిలో ఉంటాడు. తర్వాత నుండి గురుడు కదలికలోకి వస్తాడు. మీనంలో గురుడు సంచారం నాలుగు రాశులవారికి కలిసి రానుంది.  మహాభారతం ప్రకారం బృహస్పతి బ్రహ్మమానస పుత్రులలో ఒకడైన అంగీరసుని కొడుకు. ఆస్ట్రాలజీలో గురు గ్రహాన్ని శుభగ్రహంగా పరిగణిస్తారు. 

ఈ 4 రాశులపై బృహస్పతి అనుగ్రహం
వృషభ రాశి (Taurus): వృషభ రాశి జాతకంలో బృహస్పతి 11వ ఇంట్లో సంచరిస్తాడు. దీంతో మీ ఆదాయం పెరుగుతుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. వ్యాపారంలో భారీ లాభాలు వస్తాయి. ఏదైనా ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. 

మిధునరాశి (Gemini): దేవగురు మిథున రాశిలోని పదవ ఇంట్లో సంచరిస్తారు. దీని వల్ల ఈ రాశికి మంచి రోజులు మొదలవుతాయి. మీరు కొత్త ఉద్యోగం పొందే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపారులు పెద్ద పెద్ద ఆర్డర్ లను పొందవచ్చు. లక్ కలిసి వస్తుంది.  

కర్కాటక రాశి (Cancer): బృహస్పతి కర్కాటక రాశి యొక్క తొమ్మిదో ఇంటిలో సంచరిస్తాడు. దీంతో మీకు అదృష్టం కలిసి వస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. వ్యాపారస్తులు ప్రయాణాలు చేయడం వల్ల లాభం చేకూరుతుంది. విదేశాల్లో బిజినెస్ చేసే వారికి ఈ సమయం బాగుంటుంది.  

కుంభ రాశి (Aquarius): ఈ రాశి యెుక్క రెండవ ఇంట్లో దేవగురు సంచారం ఉంటుంది. అది మీకు మేలు చేస్తుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీ పనికి ఆఫీసులో ప్రశంసలు దక్కుతాయి. మార్కెటింగ్ మరియు మీడియాతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.  

Also Read: 2022 October Horoscope: దసరా, దీపావళి పండుగలకు ఈ రాశులవారి అదృష్టం ప్రకాశిస్తుంది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.       

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu       

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News