Budh Margi 2022 Effects: ఆస్ట్రాలజీలో ప్రతి గ్రహం ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించినప్పుడు దాని ప్రభావం ప్రజలందరిపైన ఉంటుంది. ఇది కొందరికి సానుకూలంగా, మరికొందరికి ప్రతికూలంగా ఉంటుంది. ఈనెల 10న బుధ గ్రహం కన్యారాశిలో తిరోగమనం చేసింది. వచ్చే నెల 2న బుధుడు మార్గంలోకి (Budh Margi 2022) వస్తాడు. దీని ప్రభావం 3 రాశులవారికి కలిసి వస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సింహరాశి (Leo): బుధుడి మార్గం సింహరాశి వారికి అపారమైన ప్రయోజనాన్ని ఇస్తుంది. ఈ రాశి యెుక్క రెండో ఇంట్లో బుధుడు సంచరించనున్నాడు.  దీంతో ఈ రాశివారు వ్యాపారంలో భారీగా లాభాలను ఆర్జిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీ కెరీర్ లో విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. 


వృశ్చిక రాశి (Scorpio): ఈ రాశి యెుక్క 11వ ఇంట్లో బుధుడు సంచరిస్తాడు. దీంతో ఈ రాశివారు ఆర్థికంగా లాభపడతారు. మీ కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొత్త ఆదాయ వనరులు తెరుచుకుంటాయి. ఈ రాశి ప్రజలు స్టాక్ మార్కెట్ లేదా లాటరీలలో మంచి లాభాలను పొందుతారు. 


ధనుస్సు రాశి (Sagittarius); బుధుడి కదలిక ఈ రాశివారికి విశేష ప్రయోజనాలను ఇస్తుంది. మీ రాశి యెుక్క పదో ఇంట్లో బుధుడి సంచారం జరుగనుంది. మీకు వ్యాపారంలో లాభాలు మెండుగా ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. 


Also Read: Guru Margi 2022: నవంబరులో దేవగురు సంచారం.. ఈ రాశులవారిపై కనకవర్షం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook