Budh Gochar 2023: గ్రహాల యువరాజైన బుధుడు మరో వారం రోజుల్లో తన రాశిని మార్చనున్నాడు. తెలివితేటలను ఇచ్చే బుధుడు జూలై 08, అర్ధరాత్రి 12 గంటలకు మిథునరాశిని విడిచిపెట్టి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. కర్కాటకంలో మెర్క్యూరీ సంచారం వల్ల ఐదు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుధ సంచారం ఈ రాశులకు వరం
వృషభం: బుధుడి సంచారం వృషభరాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. మీకు హఠాత్తుగా డబ్బు అందుతుంది. మీరు వ్యాపారంలో విజయం సాధిస్తారు. బిజినెస్ విస్తరిస్తుంది. ఉద్యోగులు పురోగతి సాధిస్తారు. పార్టనర్ షిప్ తో చేసే పనుల్లో మీరు విజయం సాధిస్తారు. మీకు సీనియర్ల నుంచి సపోర్టు లభిస్తుంది. 


తుల: బుధ సంచారం తులారాశి వారికి సంతోషాన్ని ఇస్తుంది. మీకు కొత్త ఉద్యోగం లభిస్తుంది. మీకు పదవితోపాటు డబ్బు కూడా వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ రావచ్చు. వ్యాపారవేత్తలకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 


కన్య: మెర్క్యూరీ రాశి మార్పు వల్ల కన్యారాశి వారికి కావాల్సినంత ధనం చేతికి అందుతుంది. మీకు కొత్త ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మీ కోరికలు నెరవేరుతాయి. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమ జీవితం బాగుంటుంది. 


Also Read: Venus Transit 2023: జూలై 07 నుండి ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారం.. మీది ఉందా?


మకరం: బుధగ్రహ సంచారం మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. జీవిత భాగస్వామితో బాగా కలిసిపోతారు. వివిధ వనరుల ద్వారా మీకు ఆదాయం సమకూరుతుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. 


మీనం: బుధ గోచారం వల్ల మీన రాశి వారికి గోల్డెన్ డేస్ మెుదలుకానున్నాయి. మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. మీకు వివాహం కుదిరే అవకాశం ఉంది. మీ శక్తి పెరుగుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ ధనం పెరుగుతుంది. 


Also Read: Guru Rahu Yuti 2023 : అశుభకరమైన యోగం చేస్తున్న గురు-రాహువు.. జూలైలో ఈ 4 రాశుల వారు జాగ్రత్త..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook