Shukra Rashi Parivartan 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, ఏ వ్యక్తి జాతకంలో శుక్రుడు శుభస్థానంలో ఉంటాడో వారు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు జూలై 07న సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. శుక్రుడి రాశి మార్పు మెుత్తం 12 రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. శుక్రుడి సంచారం ఏయే రాశులవారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.
వృషభం
వృషభరాశి వారికి శుక్రుని సంచారం శుభప్రదంగా ఉంటుంది. మీ జాతకంలో నాల్గో ఇంట్లో శుక్రుడు సంచరించబోతున్నాడు. దీంతో మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఏదైనా విలువైన వస్తువు కొనుగోలు చేసే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్, పుడ్ బిజినెస్ చేసేవారికి ఈ సమయం బాగుంటుంది.
తులారాశి
శుక్రుడి సింహరాశి ప్రవేశం తులరాశి వారికి అదృష్టాన్నిస్తుంది. ఎందుకంటే శుక్రుడు ఈ రాశి యెుక్క ఆదాయ గృహంలో సంచరించబోతున్నాడు. దీంతో మీరు వృత్తి మరియు వ్యాపారం రెండింటిలోనూ ప్రయోజనం పొందుతారు. బిజినెస్ చేసేవారు పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. మీరు ఆర్థికంగా లాభపడతారు. మీకు వివిధ మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతుంది. మీరు షేర్ మార్కెట్ మొదలైన వాటిలో పెట్టుబడి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
Also Read: Mangal Gochar 2023: ఈ రోజు నుండి ఈ 4 రాశులకు మహార్దశ.. ఇందులో మీరున్నారా?
సింహరాశి
ఇదే రాశిలో శుక్రుడి సంచారం జరగబోతుంది. అది కూడా సింహరాశి యెుక్క లగ్నగృహంలో. దీంతో మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. మీరు ఏ పని చేపట్టినా దానిని విజయవంతంగా పూర్తిచేస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు మీ లైఫ్ పార్టనర్ తో మంచి సమయం గడుపుతారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
Also Read: Guru Rahu Yuti 2023 : అశుభకరమైన యోగం చేస్తున్న గురు-రాహువు.. జూలైలో ఈ 4 రాశుల వారు జాగ్రత్త..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook