Mercury Retrograde 2024: బుధుడు రూట్ మార్చేసాడు.. ఈ రాశులకు జరగబోయే 100 శాతం ఇదే కాబోతోంది!
Mercury Retrograde 2024: వృశ్చిక రాశిలో బుధుడు తిరోగమనం చేయబోతున్నాడు. దీని ప్రభావం ఈ కింది రాశులవారిపై పడబోతోంది. దీంతో కొన్ని రాశులవారు అనేక సమస్యల బారిన పడే ఛాన్స్‌లు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
Mercury Retrograde 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రహం అన్ని గ్రహాల కంటే ఎక్కువ సార్లు ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తూ ఉంటుంది. అక్టోబర్ 29న బుధుడు వృశ్చిక రాశిలోకి సంచారం చేసిన సంగతి తెలిసిందే.. అయితే ఈ సంచారం కారణంగా ద్వాదశ రాశులవారిపై ప్రభావం పడింది. జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహాన్ని గుడ్ కమ్యూనికేషన్, స్నేహం, మేధస్సుకు సూచికగా భావిస్తారు. అంతేకాకుండా దీనిని అన్ని గ్రహాలకు యువరాజుగా కూడా పిలుస్తారు. జాతకంలో ఈ బుధ గ్రహం అశుభ స్థానంలో ఉంటే అనేక సమస్యలు వస్తాయి. అదే ఈ గ్రహం శుభస్థానంలో ఉంటే డబ్బుకు ఎలాంటి డోకా ఉండదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కొన్ని సందర్భాల్లో బుధుడు తిరోగమనం కూడా చేస్తారు. ఇలాంటప్పుడు కూడా ప్రత్యేకమైన ప్రభావం ఏర్పడుతూ ఉంటుంది. బుధుడు తిరోగమనం కారణంగా ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకోండి.
మేష రాశి:
బుధుడు తిరోగమనం వల్ల మేషరాశివారిపై స్పెషల్ ఎఫెక్ట్ పడుతుంది. దీని కారణంగా వీరు వ్యాపారాల్లో పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా కార్యాలయాల్లో కూడా ఆచితూచి నడుచుకోవడం చాలా మంచిది. ఈ సమయంలో కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్లడం అస్సలు మంచిది కాదు. అలాగే అనేక ఆటంకాలు కూడా ఎదురవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు ప్రసంగాలు చేసేవారు కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం వల్ల అనేక ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక వాతావరణంగా మార్పులు రావడం వల్ల ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది. అలాగే వాహనాలు నడిపే క్రమంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
ధనుస్సు రాశి:
ధనుస్సు రాశివారికి కూడా బుధుడి అశుభ ప్రభావం పడుతుంది. దీని వల్ల ఈ రాశివారు కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. దీంతో పాటు ఉద్యోగులు చేస్తున్నవారికి ఈ సమయంలో సహోద్యోగులతో ఏదో ఒక విషయంలో వాగ్వాదాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ సమయంలో అదృష్టం కూడా సహకరించకపోయే ఛాన్స్ ఉంది. ఇక వ్యాపారాలు చేస్తున్నవారికి ఈ సమయంలో తీవ్ర మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మానసిక సమస్యల బారిన కూడా పడే ఛాన్స్ ఉంది. ఆరోగ్యంపై కూడా ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతో మేలు..
మీన రాశి:
మీన రాశివారు కూడా బుధుడి తిరోగమన ప్రభావానికి గురికాబోతున్నారు. దీని కారణంగా వ్యాపారాలు చేసేవారికి అనేక సమస్యలు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. అంతేకాకుండా వీరు ఈ సమయంలో కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏవైనా నిర్ణయాలు తీసుకునే క్రమంలో రెండు నుంచి మూడు సార్లు ఆలోచించడం చాలా మంచిది. ఇక లావాదేవీల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండడం మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగాలు చేస్తేన్నవారు ఈ సమయంలో జాగ్రత్తగా ముందుకు నడుచుకోండి. ఈ సమయంలో పొట్ట సమస్యలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆహారాలు తినేక్రమంలో ఒక్కటి రెండు సార్లు ఆలోచించడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.