Mercury Rise 2023 in Leo:  గ్రహాలు కాలానుగుణంగా ఉదయించడం లేదా అస్తమించడం చేస్తాయి. ఆస్ట్రాలజీలో గ్రహాల కదలిక మెుత్తం 12 రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. సాధారణంగా గ్రహాల రైజింగ్ శుభఫలితాలను ఇస్తే.. అస్తమయం చెడు ఫలితాలను ఇస్తుంది. అష్టగ్రహాల్లో బుధుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఇతడిని గ్రహాలు రాకుమారుడిగా పిలుస్తారు. ఇతడిని తెలివితేటలు మరియు వ్యాపారానికి కారకుడిగా భావిస్తారు. సెప్టెంబరు 15న తెల్లవారుజామున 4.28 గంటలకు మెర్క్యూరీ సింహరాశిలో (Mercury Rise 2023)ఉదయించబోతున్నాడు. బుధుడి రాశి మార్పు ఏయే రాశులవారికి కలిసి వస్తుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి
సింహరాశిలో బుధుడు ఉదయించడం మేషరాశి వారికి మేలు చేస్తుంది. మీరు ఆర్థికంగా లాభపడతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. మీరు అన్ని సమస్యల నుండి బయటపడతారు. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. 
మిధునరాశి
బుధగ్రహ గమనంలో మార్పు వల్ల మిథునరాశి వారు మంచి ఫలితాలు పొందుతారు. మీరు స్థిర చరాస్థులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు కెరీర్ లో పురోగతి సాధిస్తారు. పూర్వీకుల ఆస్తులు మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది.  ఉద్యోగం కోసం ఎదురుచూసే వారి కోరిక నెరవేరుతుంది.
సింహరాశి 
ఇదే రాశిలో బుధుడు ఉదయించబోతున్నాడు. దాని కారణంగా మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీరు కెరీర్ లో సక్సెస్ అవుతారు. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. మీకు పూర్వీకులు ఆస్తి కలిసివచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. వ్యాపారులు భారీగా లాభపడతారు. 


Also Read: Janmashtami 2023: కృష్ణ జన్మాష్టమి సెప్టెంబర్ 7వ తేదీన ఇలా చేస్తే మీ ఇంట్లో అంతులేని ధనం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook