Bathing in Deoria Pond: ఈ చెరువులో స్నానాలు చేస్తే రోగాలు ఇట్టే పోతాయట

Bathing in Deoria Pond in Uttar Pradesh: మన దేశంలో భగవంతుడిని ఎంతలా నమ్ముతారో.. ప్రజల జీవితాల్లో ఒక భాగమైపోయిన విశ్వాసాలను కూడా అంతే బలంగా నమ్ముతారు. ఇప్పుడు మేం మీకు చెప్పబోయే ఈ మిస్టీరియస్ లేక్ స్టోరీ కూడా అలాంటిదే. ఈ చెరువులో స్నానాలు చేస్తే.. స్నానం ఆచరించిన వారికి ఉన్న రోగాలు మాయమవుతాయి అనే పేరు ఉంది.

Written by - Pavan | Last Updated : Sep 4, 2023, 06:34 AM IST
Bathing in Deoria Pond: ఈ చెరువులో స్నానాలు చేస్తే రోగాలు ఇట్టే పోతాయట

Bathing in Deoria Pond in Uttar Pradesh: భారత్ అంటేనే ఎన్నో రహస్యాలు, ఇంకెన్నో అద్భుతాలు, విశ్వాసాలు దాగి ఉన్న దేశం అనే పేరు ఉంది. మన దేశంలో భగవంతుడిని ఎంతలా నమ్ముతారో.. ప్రజల జీవితాల్లో ఒక భాగమైపోయిన విశ్వాసాలను కూడా అంతే బలంగా నమ్ముతారు. ఇప్పుడు మేం మీకు చెప్పబోయే ఈ మిస్టీరియస్ లేక్ స్టోరీ కూడా అలాంటిదే. ఈ చెరువులో స్నానాలు చేస్తే.. స్నానం ఆచరించిన వారికి ఉన్న రోగాలు మాయమవుతాయి అనే పేరు ఉంది. అది కేవలం ఒక విశ్వాసం మాత్రమే కాదని.. ఈ చెరువుకి వేల ఏళ్ల చరిత్ర ఉందని.. పురాణాలతోనూ ఈ చెరువుకు అనుబంధం ఉంది అని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఇంతకీ ఆ చెరువు పేరు ఏంటి ? ఎక్కడుంది ? అనే వివరాలు తెలుసుకుందాం రండి.

మీకు ఈ చెరువు చుట్టూ అల్లుకుని ఉన్న విశ్వాసాల గురించి తెలియాలంటే.. అంతకంటే ముందుగా మీరు ఉత్తర్ ప్రదేశ్ లోని దేవరియా జిల్లా గురించి తెలియాలి. గోరఖ్ పూర్ కి దక్షిణాన 50 కిమీ దూరంలో ఈ దేవరియా జిల్లా ఉంది. ఈ దేవరియాకు సమీపంలోనే కుషీనగర్ కూడా ఉంది. కుషీనగర్ అంటే తెలుసుకదా.. బుద్ధ భగవానుడికి బాగా ఇష్టమైన ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. 

ఇప్పుడు మనం ఏ నమ్మకం గురించి అయితే చెప్పుకుంటున్నామో.. అది పరశురాముడి గుడికి సంబంధించినది కూడా. ఇక్కడికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు చాలామంది వస్తుంటారు. ఈ చెరువులో స్నానం ఆచరించిన వారికి ఎలాంటి చర్మ సంబంధిత రోగాలు ఉన్నా.. అవి పూర్తిగా నయం అవుతాయనేది ఇక్కడి వారి నమ్మకం. శనివారం, ఆదివారాలు వచ్చాయంటే ఇక్కడ పెద్ద జాతరే జరుగుతుంది. ఎందుకంటే.. శని, ఆదివారాల్లో ఇక్కడ చెరువులో నీరు ఎంతో పవిత్రంగా ఉంటుందని.. అలాగే ఈ నీటికి ఉండే శక్తి రెట్టింపు అవుతుంది అని అక్కడి వారు చెబుతుంటారు. 

రోగాలు పూర్తిగా నయమైన వారు కూడా మళ్లీ మళ్లీ వచ్చి ఇక్కడ పుణ్య స్నానం చేసి పరుశురాముడి మందిరంలో మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే ఇంకెమైనా సమస్యలు ఉన్నా.. వారు మళ్లీ వచ్చి మొక్కుకుని వెళ్లిపోతుంటారు అని అక్కడి పూజారి చెప్పుకొచ్చారు. 

ఇది కూడా చదవండి : Shukra Margi 2023: సెప్టెంబరు 04న కీలక పరిణామం.. వీరి బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం ఖాయం..

దేవరియా చెరువు స్థల పురాణం ఏం చెబుతోందంటే.. పరశురాముడు ఇక్కడి చెరువులోనే పుణ్య స్నానం చేశాడని.. అప్పటి నుంచే ఆ చెరువులోని నీటికి ఎన్నో మహిమలు వచ్చాయని.. చర్మ సంబంధిత రోగాలు నయం చేసే శక్తి ఆ చెరువు సొంతమైందని అక్కడి స్థల పురాణం చెబుతోంది. ఈ కారణంగానే ఉత్తర్ ప్రదేశ్‌తో పాటు అక్కడికి సమీప ప్రాంతాల నుండే కాకుండా దూర ప్రాంతాల నుండి సైతం జనం ఇక్కడికి వచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తుంటారు. అలా దేవరియా జిల్లాలోని దేవరియా చెరువు పరుశు రాముడి పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది.

ఇది కూడా చదవండి : Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు..వీరి జీవితాల్లో హెచ్చు తగ్గులు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News