Mercury Transit 2022 in Libra: ఈ రోజు నుండి 24 రోజుల పాటు ఈ 4 రాశులవారికి డబ్బే..డబ్బే.. ఎందుకో తెలుసా..?
Mercury Transit 2022 in Libra: బుధ గ్రహం తన రాశిని వదిలి ఇతర రాశిలోకి సంచారం చెయబోతున్నాడు. అయితే సంచారం వల్ల కింద పెర్కొన్న రాశుల వారు మంచి ప్రయోజనాలు పొందబోతున్నారు. అయితే ఈ క్రమంలో వీరు ఆర్థిక సమస్యల నుంచి కూడా సులభంగా బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి.
Budh Rashi Parivartan 2022: అన్ని రాశులు ఒక క్రమంలో తన సొంత రాశిని వదిలి ఇతర రాశిలోకి వెళ్లడం సహజం. అయితే ఈ రోజూ బుధ గ్రహం కన్యారాశిని వదిలి తులారాశిలోకి ప్రవేశిస్తోంది. మీ అందరికీ తెలిసిందే తులా రాశి వారు సంపద, తెలివితేటలు, వ్యాపారం, తర్కంలకు చిహ్నం అని. అయితే ఈ రాశి వారిలో పలు రకాల మార్పులు రాబోతున్నాయి. బుధ గ్రహం వచ్చే నెల (నవంబర్ 19, 2022) వరకు తులారాశిలో ఉంటాడు. ఈ గ్రహ సంచారం వల్ల తులారాశిలో 4 గ్రహాలు కలిసే అవకాశాలున్నాయి. ఇప్పటికే సూర్యుడు, శుక్రుడు, కేతువు తులారాశిలో ఉన్నారు. ఈ గ్రహాల కలయిక 4 రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
ఈ రాశుల వారి డబ్బే..డబ్బే:
మిథునం:
తులారాశిలో బుధ సంచారం వల్ల మిథునరాశి వారికి శుభ ఫలితాలను ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఈ రాశి వారు వృత్తి పంరంగా లాభపడతారు. వీరి ఆదాయం పెరగవచ్చని జోతిష్య శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు అధికంగా లాభాలు పొందుతారు. అంతేకాకుండా వీరు విద్యా పరంగా మంచి ఉత్తిర్ణీత పొందుతారు. ఈ రాశుల వారికి గౌరవం పెరుగుతుంది.
కర్కాటక రాశి:
ఈ సంచారం వల్ల కర్కాటక రాశి వారు రాజయోగ గడియలు అనుభవించబోతున్నారు. ఈ రాశివారికి కుటుంబం పరంగా మద్దతు లభిస్తుంది. అంతేకాకుండా వీరు ఊహించని డబ్బు పొందుతారు. ఆర్థిక సమస్యలు కూడా తగ్గిపోతాయి. వ్యాపారాల్లో పెద్ద ఒప్పందాలు పొందుతారు. ఈ రాశివారు కూడా విద్యాపరంగా మంచి ప్రయోజనాలు పొందుతారు.
సింహ:
బుధ గ్రహ సంచారం సింహరాశి వారికి వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయి. అంతేకాకుండా ఈ క్రమంలో అన్నదమ్ముల మధ్య ప్రేమ పెరుగుతుంది. ఈ రాశివారికి సమాజంలో గౌరవం లభించడమేకాకుండా కుటుంబంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. భవిష్యత్‌లో మంచి అవకాశాలు పొందుతారు.
ధనుస్సు:
ఈ సంచారం వల్ల ధనుస్సు రాశి వారు కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా, సామాజికంగా బలపడుతారు. అయితే ఈ క్రమంలో వీరు చేసే పనిపై ప్రత్యేక శ్రద్ధ పెడితే.. ఆదాయం పెరగడంతో పాటు ధనవంతులయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని జోతిష్య శాస్త్ర నిసుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం పొందుతారని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కుటుంబంలో సంతోషం, సౌభాగ్యం, శాంతి పెరుగుతుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి