Mercury Transit 2022: హిందూమతం ప్రకారం ప్రతి నెల రాశి పరివర్తనం ఉంటుంది. ఆగస్టు 21వ తేదీన బుధ గ్రహం రాశి మారనున్నాడు. ఫలితంగా కొన్ని రాశులపై ప్రతికూలంగా, కొన్ని రాశులకు శుభప్రదంగా మారనుంది. బుధ గోచారం కారణం ఏ రాశులకు ధనలాభం కలగనుందో చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైందవ మతంలో ప్రతి రాశికి, ప్రతి గ్రహానికి ప్రాధాన్యత, మహత్యముంది. ప్రతి నెల ఏదో ఒక గ్రహం రాశి మారడం జరుగుతుంటుంది. ఫలితంగా అన్ని రాశులపై ప్రభావం ఉంటుంది. ఆగస్టు 21వ తేదీన బుధుడు కన్యారాశిలో ప్రవేశించనున్నాడు. బుధుడిని బుద్ధికి దేవతగా, గ్రహాల రాజకుమారుడిగా భావిస్తారు. బుధ గ్రహం మిధున, కన్యారాశులపై గురువు. కన్యారాశి బుధుడికి ఉచ్ఛరాశి కాగా, మీనం దిగువరాశిగా ఉంది. జ్యోతిష్యం ప్రకారం బుధుడిని బుద్ధి, జ్ఞానం, మిత్రత్వానికి ప్రతీకలుగా భావిస్తారు. ఆగస్టు 21న బుధుడు కన్యారాశి ప్రవేశం కారణంగా 4 రాశులపై పూర్తిగా శుభ ప్రభావం పడనుంది. ఆ నాలుగు రాశుల జాతకం మారిపోనుంది. 


మిధునరాశిపై బుధ గోచారం ప్రభావం జాతకాన్ని మార్చేస్తుంది. ఈ రాశివారికి కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు, ఆనందం ఉంటాయి. ఈ సమయంలో కుటుంబసభ్యులతో సంబంధాలు బాగుంటాయి. ఆఫీసులో తోటి ఉద్యోగులు, అధికారుల సహకారం లభిస్తుంది. దాంతోపాటు ప్రతి పనిలో సాఫల్యం లభిస్తుంది. 


కర్కాటక రాశివారిపై బుధ గోచారం ప్రభావం పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. గుడ్‌న్యూస్ వింటారు. ఈ సందర్భంగా ఈ రాశి జాతకులు కెరీర్, కుటుంబ జీవితం రెండింట్లోనూ హాయిగా ఉంటారు. జర్మలిజం, రచన, కన్సల్టేషన్, దర్శకత్వ రంగాల్లో అంతులేని లాభాలు కలుగుతాయి. కర్కాటకరాశి వారికి అన్ని చోట్లా బాగుంటుంది. 


సింహరాశిపై బుధ గోచారం ప్రభావం అత్యంత లాభదాయకంగా ఉంటుంది. అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్ధిక పరిస్థితుల్లో మెరుగైన మార్పు ఉంటుంది. కొత్త కొత్త విధానాల ద్వారా డబ్బు సంపాదించడంలో విజయం సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. 


కన్యారాశిపై బుధ గోచారం ప్రభావం మెరుగ్గా ఉంటుంది. బుధుడి ఇదే రాశిలో ప్రవేశించనున్నాడు. అత్యంత లాభదాయకమైన పరిణామాలుంటాయి. ఆరోగ్య విషయాల్లో పాజిటివిటీ ఉంటుంది. డబ్బు సమస్య ఏ కోశానా ఉండదు. యాత్రలు కలిసొస్తాయి.


Also read: Janmashtami 2022: జన్మాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి, ఆగస్టు 18 లేదా ఆగస్టు 19నా, శుభ ముహూర్తం ఎప్పుడు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook