Mercury Transit 2023: బుధ గోచారం ఆ రాశివారికి ప్రమాదకరం, తస్మాత్ జాగ్రత్త
Mercury Transit 2023: హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వివిధ గ్రహాలు నిర్ణీత సమయంలో రాశి మారుతుంటాయి. ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కోలా ఫలితాలుంటాయి. కొన్ని రాశులపై ప్రతికూలంగా, కొన్నింటికి అనుకూలంగా ఉంటుంది. బుధ గోచారం ఫలితం అలాగే ఉండబోతోంది.
Mercury Transit 2023: బుధుడి గోచారం ఓ రాశి జాతకంపై తీవ్ర ప్రభావం కల్గించనుంది. బుధుడి గోచారంతో ధనస్సు రాశి జాతకులు చాలా అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే సర్వం కోల్పోయే ప్రమాదముంది. ఇంటి ఆర్ధిక వ్యవహారాలు చెడిపోవచ్చు. బుధుడి గోచారం ఈ రాశికి అంత ప్రమాదకరం కానుంది.
బుధ గ్రహం ఈ నెల అంటే మార్చ్ 31వ తేదీ మేష రాశిలో ప్రవేశించనున్నాడు. ఇది మంగళ గ్రహం రాశి కావడంతో ఒకే రాశిలో కలవడం వల్ల రెండింటి మధ్య అవగాహన కుదురుతుంది. ఫలితంగా ధనస్సు రాశి ఉద్యోగుల పరిస్థితి దిగజారుతుంది. ఈ రాశి జాతకులు తమ పనిపై దృష్టి పెట్టాలి. చేసే పని బాగుండేట్టు చూసుకోవాలి.
వ్యాపారులకు ఈ సమయంలో ఆర్ధిక నష్టం కలుగుతుంది. అందుకే ఎక్కడైనా పెట్టుబడి పెట్టేటప్పుడు పూర్తిగా ఆలోచించి పెట్టాల్సి ఉంటుంది. ప్రభుత్వం అధికారులతో పని విషయంలో చాలా వినయంగా వ్యవహరించాలి. అధికారుల నిర్ణయం మీకు అనుకూలంగా లేకపోయినా వాదనకు దిగవద్దు. సంయమనంతో వ్యవహరించండి. లేకపోతే మీకు ఇబ్బందులు ఎదురౌతాయి. ఈ రాశి యువకులు ఏదో తెలియని భయంతో ఇబ్బంది పడుతుంటారు. ప్రభుత్వ నిబంధనల్ని ఉల్లంఘించినవారు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఈ సమయంలో విద్యార్ధులకు చదువుపై ఆసక్తి తగ్గుతుంది. ప్రతిరోజూ షెడ్యూల్ ప్రకారం చదవాల్సి ఉంటుంది. నిరంతరం అభ్యాసం చేయడం ద్వారా పరీక్షల్లో మంచి ఫలితాలు పొందవచ్చు.
ఇక ఆర్ధిక వ్యవహారాలు బడ్జెట్ ప్రకారం చేసుకోవాలి. బడ్జెట్ లేకుండా చేయడం వల్ల ఆర్ధిక పరిస్థితి వికటిస్తుంది. సంతానం ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ద్వారా ఇమ్యూనిటీ పటిష్టమై వివిధ రోగాలతో పోరాడే శక్తి వస్తుంది. ఏదైనా యాత్రలకు వెళ్లేటప్పుడు తెలియని వ్యక్తులతో స్నేహం మంచిది కాదు. ప్రత్యేకించి మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. మలబద్ధకం సమస్య తలెత్తకుండా తగిన ఆహారం తీసుకోవాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook