Trigrahi Yoga 2023: గ్రహాల రాశిలో మార్పు ప్రజలందరిపై కనిపిస్తుంది. రీసెంట్ గా సూర్యభగవానుడు, బుధుడు మీనరాశిలో సంచరించారు. ఇప్పటికే అదే రాశిలో బృహస్పతి సంచరిస్తున్నాడు. మీనరాశిలో ఈ మూడు గ్రహాల కలయిక కారణంగా అరుదైన త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. సూర్య బుధ మరియు గురు యుతి ఏ రాశులకు కలిసి వస్తుందో తెలుసుకుందాం.
త్రిగ్రాహి యోగం ఈ రాశులకు వరం
మీనం: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీనరాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ మూడు గ్రహాల కలయిక మీ యెుక్క లగ్న గృహంలో ఏర్పడుతుంది. దీంతో మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పార్టనర్ షిప్ తో చేసే పనుల్లో మీరు విజయం సాధిస్తారు. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. మీరు అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకుంటారు.
వృశ్చికం: ఈ రాశి వారికి త్రిగ్రాహి యోగం అనుకూలంగా ఉంటుంది. దంపతులకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. మీరు ఊహించని ధనలాభం పొందుతారు. ఆధ్యాత్మిక, పరిశోధన రంగాలకు సంబంధించిన వారికి ఈ సమయం బాగుంటుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది.
ధనుస్సు: ఈ రాశి వారికి త్రిగ్రాహి యోగం లాభిస్తుంది. ఈ సమావేశం జాతకంలో నాల్గవ ఇంట్లో ఉంది. దీని కారణంగా మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీరు ఏదైనా కారు లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగులు, వ్యాపారులు లాభపడతారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి.
Also Read: Budh Shukra Rahu Yog: మార్చి 31న మేష రాశిలో 3 గ్రహాల కలయిక.. ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారమే ఇక..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook