COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Mercury Transit 2023: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గ్రహాల గమనాన్ని గ్రహ సంచారాలు కూడా అంటారు. గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశి సంచారం చేయడం వల్ల వ్యక్తిగత జీవితంలో అనేక రకాల మార్పులు వస్తాయి. జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన బుధ గ్రహం అక్టోబర్ ఒకటో తేదీన సింహరాశి నుంచి కన్యారాశిలోకి సంచారం చేయబోతోంది ఈ సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం వరించబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ బుధుడి సంచారంతో ఏ ఏ రాశుల వారికి అదృష్టం వరించబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


బుధుడి సంచారం కారణంగా మేష రాశి వారికి ఈ సమయం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా సంతోషంగా ఉంటుంది. దీంతోపాటు వీరిలో ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. అనారోగ్య సమస్యలు ఉంటే ఈ సమయంలో పూర్తిగా నయం అవుతాయి. దీంతోపాటు విద్యను అభ్యసించే వారికి ఈ సమయం చాలా ప్రయోజనకరంగా ఉంది. బుధుడి సంచార కార్యక్రమంలో స్నేహితులకు ఇతరులకు బట్టలు బహుమతులుగా ఇవ్వడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. కుటుంబ జీవితంలో శాంతి, ఆనందం రెట్టింపు అవుతుంది.


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు


మిధున రాశి వారికి కూడా ఈ సమయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వీరికి మానసిక ప్రశాంతత రెట్టింపు అవుతుంది. దీంతో పాటు కుటుంబ జీవితంలో ఆనందం పెరుగుతుంది. విశ్వాసం పెరగడం కారణంగా ఉద్యోగ జీవితంలో మంచి ఫలితాలు పొందుతారు. ఇక వ్యాపారాలు చేసే వారి విషయానికొస్తే పరిస్థితులు సంతృప్తికరంగా మారుతాయి. ఈ సమయంలో ఆదాయానికి ఎలాంటి లోటు ఉండదు. దీంతోపాటు వాహన సౌకర్యం కూడా పెరుగుతుంది.


సింహ రాశి వారు బుధుడి సంచారం కారణంగా ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు అంతేకాకుండా వ్యాపారాల్లో పరిస్థితులు మరింత మెరుగుపడతాయి. ఇక వృత్తి జీవితాన్ని గడుపుతున్న వారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి స్నేహితులతో కలిసి ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వడం వల్ల ఉద్యోగ అవకాశాలు పొందే ఛాన్స్ కూడా ఉంది. ఈ సమయంలో సింహ రాశి వారు విహారయాత్రలకు కూడా వెళ్లవచ్చు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేవారు ఈ సమయంలో లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఊహించని లాభాలు పొందే ఛాన్స్ కూడా ఉంది.


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి