Mercury transit 2023: బుధ గోచారం ప్రభావం, సరిగ్గా 5 రోజుల్లో ఈ 3 రాశులకు అపార ధనలాభం
Mercury transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల గోచారం ప్రభావం వివిధ రాశులపై వేర్వేరుగా ఉంటుంది. కొన్ని రాశులకు ఇబ్బందులు కలగజేస్తే..మరి కొన్నిరాశులకు అంతులేని ప్రయోజనాలు అందిస్తాయి. బుధ గోచారం ప్రభావం గురించి తెలుసుకుందాం..
Mercury transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం బుధుడిని ధనం, వ్యాపారం, బుద్ధికి కారకుడిగా భావిస్తారు. మార్చ్ 31వ తేదీన బుధగ్రహం గోచారంతో మేషరాశిలో ప్రవేశించనున్నాడు. ఈ ప్రభావం 3 రాశులపై ఊహించని విధంగా ఉంటుంది. దశ తరిగిపోనుంది. అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి.
జ్యోతిష్యం ప్రకారం ప్రస్తుతం బుధుడు మీనరాశిలో ఉన్నాడు. మార్చ్ 31వ తేదీన మేషరాశిలో ప్రవేశించనున్నాడు. బుధుడిని గ్రహాలకు రాజకుమారుడిగా పిలుస్తారు. బుధ గ్రహం ధనం, బుద్ధి, వ్యాపారానికి కారకుడు కావడంతో మేషరాశిలో ప్రవేశించడం వల్ల అద్భుత లాభాలు కలగనున్నాయి. మేషరాశిలో అప్పటికే శుక్ర, రాహు గ్రహాలున్నాయి. మేష రాశిలో బుధ, శుక్ర, రాహు గ్రహాల యుతి ప్రభావం అన్ని రాశులపై పడనుంది. ముఖ్యంగా 2 రాశలకు ఊహించని లాభాలు కలగనున్నాయి.
బుధ గోచారంతో దశ తిరగనున్న రాశులు
మేష రాశి
బుధ గోచారం ద్వారా మేష రాశిలో ప్రవేశం శుభ ప్రభావం కల్గించనుంది. మేష రాశివారికి ఊహించని లాభాలు కలగనున్నాయి. మేషరాశి జాతకుల వ్యక్తిత్వం ఆకర్షణీయం కానుంది. అపారమైన ధనలాభముంటుంది. ఫలితంగా ఆర్ధిక ఇబ్బందులు దూరమౌతాయి. కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. పెండింగులో పనులు పూర్తవుతాయి.
కర్కాటక రాశి
బుధుడి రాశి పరివర్తనం ప్రభావం కర్కాటక రాశి జాతకులపై శుభప్రదంగా ఉంటుంది. మీ ఆందోళనలు దూరమౌతాయి. అపారమైన ధనలాభముంటుంది. సంతానంతో సుఖం లభిస్తుంది. సంతాన సంబంధిత శుభవార్తలు వింటారు. ఆరోగ్య సంబంధ సమస్యలు ఉత్పన్నం కావచ్చు. వెరసి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రతి పనిలో విజయం సాధిస్తారు.
కుంభరాశి
బుధుడి రాశి పరివర్తనం కుంభరాశి జాతకులకు ఊహించని లాభాల్ని ఇస్తుంది. ప్రత్యేకించి వ్యాపారులకు భారీ ధనలాభం కలుగుతుంది. అదృష్టం తోడుగా ఉంటుంది. ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు, పదోన్నతి ఉంటాయి. పెట్టుబడులకు అనువైన సమయం.
Also read: Sri Rama Navami 2023: శ్రీరామ నవమి నాడు అరుదైన యోగాలు.. ఈ మూడు రాశుల వారికి సంచుల కొద్ది ధనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook