Mercury Transit 2024: మరో 3 రోజుల్లో ఈ రాశుల వారికి డబ్బు యోగం పట్టబోతోంది.. ఎటు చూసినా డబ్బే డబ్బు!
Mercury Transit 2024: బుధుడి నక్షత్ర సంచారం కారణంగా మేష రాశి నుంచి మీన రాశి వరకు విశేష ప్రభావం పడుతుంది. దీని కారణంగా కొంతమందికి లాభాలు పొందితే మరి కొంత మందికి నష్టాలు కలుగుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశుల వారు అత్యధిక లాభాలు పొందుతారో తెలుసుకోండి.
Mercury Transit 2024: ఏ గ్రహమైన ఒక నిర్దిష్ట సమయంలో రాశి సంచారం చేస్తుంది. ప్రతి గ్రహం ఏదో ఒక సందర్భంలో రాశి సంచారం తప్పకుండా చేస్తుంది. అయితే కొన్ని గ్రహాలు నెలకు ఒకసారి ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రవేశిస్తే.. మరికొన్ని గ్రహాలు మాత్రం కొన్ని ఏళ్ల తర్వాత ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉంటాయి. ఈ సమయంలో మేష రాశి నుంచి మీన రాశి వరకు అన్ని రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. కొందరికి ఈ ప్రభావం శుభ ఫలితాలను అందిస్తే మరికొందరికి మాత్రం అశుభ ఫలితాలను అందిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కమ్యూనికేషన్, వ్యాపారానికి సూచికగా భావించే బుధుడు అతి త్వరలోనే నక్షత్ర సంచారం చేయబోతున్నాడు. అక్టోబర్ 14వ తేదీన భూతగ్రహం రాహు సొంత నక్షత్రంగా పరిగణించే స్వాతి నక్షత్రంలోకి ప్రవేశించబోతోంది. దీని కారణంగా 12 రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో మూడురాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది.
మిథున రాశి:
మిథున రాశి వారికి బుధుడు నక్షత్ర సంచారం చేయడం కారణంగా ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ రాశి వారికి నిలిచిపోయిన డబ్బులు కూడా ఈ సమయంలో తిరిగి వచ్చే అవకాశాలు న్నారు. దీంతో పాటు ఆర్థిక పరిస్థితులు కూడా చాలా వరకు మెరుగుపడతాయి వ్యాపారాలు చేస్తున్న వారికి అనుకున్న ధన లాభాలు కలగడమే కాకుండా సాఫీగా సాగుతాయి. అలాగే గతంలో నష్టాల్లో ఉన్నవారు కూడా ఊహించని ధన లాభాలు పొందగలుగుతారు. ఈ సమయంలో కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. అలాగే వృత్తిపరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
కుంభరాశి :
కుంభరాశి వారికి కూడా బుధుడు స్వాతి నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల చాలా వరకు మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఉద్యోగాల్లో వస్తున్న ఎలాంటి అడ్డంకులైన సులభంగా తొలగిపోతాయి. అలాగే వీరికి ఆత్మవిశ్వాసం పెరిగి ఎలాంటి పనులైనా సులభంగా చేయగలుగుతారు. అలాగే ఈ రాశి వారికి అనుకున్న ప్రయోజనాలు పొందడమే కుటుంబ జీవితంలో సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. దీంతోపాటు కుంభ రాశి వారికి శని అనుగ్రహంతో కొన్ని వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల అపారమైన లాభాలు కూడా పొందుతారు.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
కన్యా రాశి :
బుధుడు నక్షత్ర సంచారం కారణంగా విశేష లాభాలు పొందుతారు. ముఖ్యంగా ఈ రాశి వారు అద్భుతమైన శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి ఆదాయ వనరులు కూడా విపరీతంగా పెరుగుతాయి. దీంతోపాటు గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు కూడా భిన్నంగా ఉంటాయి. ఉద్యోగాల కోసం ఎప్పటినుంచో చూస్తున్న వారికి కొత్త జాబ్ ఆఫర్స్ కూడా లభిస్తాయి. ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్స్ కూడా లభిస్తాయి దీని కారణంగా కొంతమందికి జీతాలు కూడా పెరగవచ్చు అలాగే సీనియర్ల సపోర్టు లభించి ఎలాంటి పనులైన సులభంగా చేయగలుగుతారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఈ సమయం కాస్త ఉపశమనం కలిగిస్తుంది.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.