Mercury Transit 2024: బుధుడి గోచారం ప్రభావం, ఈ 3 రాశులకు అక్టోబర్ 10 నుంచి పట్టిందల్లా బంగారమే
Mercury Transit 2024: హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికకు విశేష ప్రాధాన్యత, మహత్యం ఉన్నాయి. గ్రహాలు రాశి మారిన ప్రతిసారీ ఇతర రాశులపై అనుకూలంగా లేదా ప్రతికూలంగా ప్రభావం కన్పిస్తుంటుంది. ఇప్పుడు అక్టోబర్ నెలలో కొన్ని రాశులకు మహర్దశ పట్టనుంది. ఆ వివరాలు మీ కోసం..
Mercury Transit 2024: జ్యోతిష్యం ప్రకారం బుధుడిని గ్రహాల రాజకుమారుడిగా పరిగణిస్తారు. అందుకే బుధ గోచారానికి విశేష మహత్యం ఉంది. బుదుడి రాశి పరివర్తనం ప్రభావం కొన్ని రాశులపై గణనీయంగా ఉంటుంది. బుధుడి కదలికలపై జ్యోతిష్య పండితులు ఎప్పుడూ ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు. బుధుడి గోచారం సహజంగా అదృష్ట కారకమౌతుందంటారు. ఇప్పుడు అక్టోబర్ నెలలో బుధుడి గోచారం కారణంగా మూడు రాశులకు అదృష్టం పట్టనుంది. ఆ లక్కీ రాశులేవో చూద్దాం.
హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవగ్రహాలు వేర్వేరు సమయాల్లో నిర్ధిష్ట రాశిలో ప్రవేశిస్తుంటాయి. అదే విధంగా బుధ గ్రహం అక్టోబర్‌లో రెండు రాశుల్లో మారనున్నాడు. అక్టోబర్ 10 వ తేదీ ఉదయం 11.09 గంటలకు తులా రాశిలో బుధుడు ప్రవేశించనున్నాడు. అస్తంగత్వ దశలో అక్టోబర్ 22న తులా రాశిలో ఉదయించనున్నాడు. అక్టోబర్ 29 వరకూ ఇదే రాశిలో కొనసాగి రాత్రి వృశ్చిక రాశిలో ప్రవేశించనున్నాడు. హిందూ జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం బుధుడు గ్రహాలకు రాజకుమారుడు. బుధుడిని తెలివితేటలు, మాట, జ్ఞానాన్ని కారకంగా భావిస్తారు. అందుకే బుధుడి ఈ గోచారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. మూడు రాశులకు అదృష్టం సుడి పట్టినట్టు పడుతోంది. ఊహించని సంపద లభిస్తుంది. ఆర్ధికంగా మంచి స్థితిలో ఉంటారు. వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఉండేవారికి మంచి సమయం. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు.
బుధుడు ఈ నెలలో మొదట తులా రాశిలో సంచరించి ఆ తరువాత వృశ్చికంలో ప్రవేసించనున్నాడు. దాంతో వృశ్చిక రాశి జాతకులకు దశ తిరిగిపోనుంది. జీవితంలో అన్నీ లభిస్తాయి. సానుకూల పరిణామాలు ఎదురౌతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఉద్యోగులకు పదోన్నతి, వేతన పెంపు ఉంటుంది. ఆకశ్మిక ధనలాభం కలగడంతో ఆర్ధికంగా మంచి స్థితిలో ఉంటారు. ఎప్పట్నించో పెండింగులో ఉన్న సమస్యలు దూరమౌతాయి.
మకర రాశి జాతకులకు అక్టోబర్ నెల అద్భుతమైన సమయం. ఈ నెలలో ఈ రాశివారికి అంతా అనుకూలిస్తుంది. ఉద్యోగులకు కలిసి వస్తుంది. కోరుకున్న విధంగా ఉద్యోగ మార్పు ఉండవచ్చు. పదోన్నతితో పాటు ఆదాయం పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు తెర్చుకుంటాయి. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. అక్టోబర్ 10 నుంచి 29 వరకూ ఈ రాశివారికి తిరుగే ఉండదు. చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఆకశ్మిక ధనలాభం కలుగుతుంది. ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు.
తులా రాశి జాతకులకు ఈ నెల చాలా బాగుంటుంది. బుదుడు రెండు రాశుల్లో సంచరించడం వల్ల ఊహించని సంపద వచ్చి పడుతుంది. అక్టోబర్ నెలలో ఈ రాశివారు వెనుదిరిగి చూసుకోవల్సిన అవసరముండదు. వ్యాపారులు కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు అనువైన సమయం. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. మీరు చేసే పనులతో సమాజంలో మీ పట్ల గౌరవం పెరుగుతుంది. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. విద్యార్ధులకు కెరీర్ బాగుంటుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆర్ధికంగా మంచి స్థితిలో ఉంటారు.
Also read: Railway Jobs: కేవలం 10వ తరగతి విద్యార్ఙతతో 63 వేల జీతంతో రైల్వేలో ఉద్యోగాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.