Mercury Transit Effect : రాశులపై బుధగ్రహ ప్రభావం.. ఆ రాశులవారు ఈ పరిహారాలతో గట్టెక్కొచ్చు
Mercury Transit Effect బుధ సంచారం వల్ల అన్ని రాశుల వారికి కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అయితే వాటికి పరిహారాలు కూడా ఉన్నాయి.
Mercury Transit Effect : బుధ సంచారం వల్ల అన్ని రాశుల వారు ప్రభావితం కావాల్సి ఉంటుంది. ఒక్కో రాశి వారికి ఒక్కో రకంగా ఉండబోతోంది.అయితే వీటికి పరిహార చర్యలు కూడా ఉన్నాయి. అయితే ఏ ఏ రాశిని ఎలా ప్రభావితం చేయబోతోంది.. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఏర్పడన్నాయి.. ఏ రాశి వారికి ఏ పరిహారం ఉందో ఓ సారి చూద్దాం.
బుధ ప్రభావం..
ఈ రోజు నుండి బుధుడు తులారాశిలో ప్రవేశించబోతోన్నాడు. ఇక ఇందులోనే నవంబర్ 13 వరకు ఉంటాడు. దీని తర్వాత మళ్లీ వృశ్చికరాశిలోకి ఎంటర్ అవుతాడు. ఈరోజు మధ్యాహ్నం 01:38 గంటలకు బుధుడు కన్యారాశిని వదిలి తులారాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ బుధ సంచారము మొత్తం 12 రాశులను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం
మేషరాశిపై ఎలాంటి ప్రభావం అంటే..
మేష రాశి వారికి ప్రయాణాలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పర్యటన కోసం ఖర్చులు చెల్లించాల్సి ఉంటుంది. భాగస్వామ్యంతో చేసే వ్యక్తులకు వ్యాపారంలో విజయాలు చేకూరుతాయి. మీ తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడతాయి. బుధవారం నాడు దుర్గాదేవికి పచ్చటి గాజులు సమర్పించడం వీరికి పరిహారం.
వృషభరాశిపై బుధగ్రహ ప్రభావం
వృషభ రాశి వారి ఆర్థిక స్థితి బాగుంటుంది. డబ్బు సంపాదించేందుకు అవకాశాలు వస్తాయి. పాత రుణాలను చెల్లిస్తారు. గృహోపకరణాల కొనుగోలు చేస్తారు. దీంతో ఖర్చులు అధికమవుతాయి. ప్రేమికుడితో కలిసి విహారయాత్రకు వెళ్లేందుకు కూడా ప్లాన్ చేసుకుంటారు. బుధవారం ఉపవాసం ఉండటం వీరికి పరిహారం.
మిథునరాశిపై ఎలా ఉంటుందంటే?
బుధ సంచారము వలన కుటుంబ సభ్యులతో మిథున రాశి వారు ఎక్కువ సమయం గడుపుతారు. పాత సమస్యల నుంచి బయటపడే అవకాశాలు వస్తాయి. కుటుంబంలో మీ గౌరవం, పనిలో కూడా చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. దుర్గాదేవిని పూజించడం, ప్రతి బుధవారం నెయ్యి దీపం వెలిగిస్తే శుభపరిణామాలు కలుగుతాయి.
కర్కాటకంపై బుధగ్రహ ప్రభావం..
కర్కాటక రాశి వారికి అంతా శుభప్రదంగా ఉంటుంది. కుటుంబ జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంటి సభ్యులు కలిసి ఒకరికొకరు సహకరించుకుంటారు. డబ్బు అధికంగా వస్తుంది, ఉద్యోగుల ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ రాశి వారు ఎవ్వరికీ డబ్బులను చెల్లించొద్దు. ప్రతి బుధవారం శ్రీ దుర్గా చాలీసా పఠించడం వల్ల ప్రయోజనాలు కలుగుతాయి.
సింహరాశిపై బుధగ్రహ ప్రభావం
తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడతాయి. మీ మాటకు ఇంట్లో కూడా ఎంతో విలువ ఇస్తారు. పని పరంగా మీకు ఈ సమయం చాలా కలిసి వస్తుంది. ఈ కాలంలో మీ కోరికలు తీరే అవకాశం ఉంది. ఈ రవాణా కాలంలో మీ అదృష్టాలు మారే అవకాశం కనిపిస్తోంది.ఎలాంటి డబ్బును పెట్టుబడి పెట్టకుండా కాస్త జాగ్రత్తగా ఉండాలి. విష్ణువుని పూజిస్తే అరిష్టాలు దూరమవుతాయి.
కన్యారాశిపై బుధగ్రహ ప్రభావం
ఈ రాశి వారికి పనిలో విజయాలు చేకూరుతాయి. చేపట్టిన పని సంపూర్ణం అవుతుంది. ఆదాయం అధికంగానే ఉంటుంది. వ్యాపార తరగతి వ్యక్తులకు పాత పెట్టుబడుల నుంచి లాభాలు వచ్చే చాన్స్ ఉంది. విద్యార్థులకు కూడా కలిసి వస్తుంది. పోటీ పరీక్షలలో విజయం సాధించగలరు. ఓం నమో భగవతే వాసుదేవై అనే మంత్రాన్ని పఠించాలి.
తులారాశిపై బుధగ్రహ ప్రభావం
ఈ రవాణా కాలంలో మిశ్రమ ఫలితాలు వస్తాయి. డబ్బు సంపాదిస్తారు కానీ అంతే స్థాయిలో ఖర్చులుంటాయి. డబ్బు పెట్టుబడి పెట్టకూడదు. వైవాహిక జీవితం బాగుంటుంది. భాగస్వామితో మాట్లాడేటప్పుడు మంచి మర్యాదలు పాటించాలి.
పేదవారికి ఆకుపచ్చని బట్టలు దానం చేస్తే కాస్త ఉపశమనం కలుగుతుంది.
వృశ్చికరాశిపై బుధగ్రహ ప్రభావం
ఆర్థిక విషయాలపై కాస్త జాగ్రత్త వహించాల్సి ఉంటుంది పెరుగుతున్న ఖర్చుల కారణంగా మీరు ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం చాలా మంచిది. కొన్ని శుభవార్తలను పొందవచ్చు. ఉద్యోగులు ప్రత్యర్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. దుర్గా దేవీ మంత్రాలను జపిస్తే బాగుంటుంది.
ధనుస్సు రాశిపై బుధగ్రహ ప్రభావం
మంచి ఆర్థిక అవకాశాలు వస్తాయి. ఆర్థిక సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పొగొట్టుకున్న డబ్బును కూడా తిరిగి పొందవచ్చు. మీ సహోద్యోగులను ఆకట్టుకుంటారు. మీ కుటుంబ జీవితం హాయిగా సాగుతుంది. నిలిచిపోయిన ప్రాజెక్ట్ ముందుకు సాగుతుంది. బుధవారం గణపతిని పూజిస్తే శుభాలు కలుగుతాయి.
మకరరాశిపై బుధగ్రహ ప్రభావం
మకర రాశి వారు తమ వ్యాపారాన్ని పెంచుకోవచ్చు. సంస్థ లేదా బ్యాంకు నుంచి లోన్ తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. కుటుంబ పెద్దలను సంప్రదించి ఏదైనా నిర్ణయం తీసుకుంటే మంచి జరుగుతుంది . తల్లి ఆరోగ్యం క్షీణించవచ్చు. వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంటారు. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠిస్తే అరిష్టాలు తొలుగుతాయి.
కుంభరాశిపై బుధగ్రహ ప్రభావం
సంతాన సంబంధిత సవాళ్లను ఎదుర్కొంటారు. ఈ కాలంలో మీకు సాధారణం కంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. ఖర్చు అధికం అవుతుంది. తోబుట్టువులతో మీ సంబంధం కూడా ప్రభావితం అయ్యేందుకు అవకాశం ఉంది. వివాహితులు పిల్లల పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అవసరమైన విద్యార్థికి విద్యా సామగ్రిని విరాళంగా ఇస్తే మంచి జరుగుతుంది.
మీనరాశిపై బుధగ్రహ ప్రభావం
కెరీర్లో అభివృద్ధి, విజయం సాధిస్తారు. ఆర్థికంగా చాలా బాగుంటుంది. డబ్బు లేకపోవడం వల్ల తీసుకోలేని నిర్ణయాలు ఇప్పుడు తీసుకోగలుగుతారు. ప్రస్తుతం, మీరు మీ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలని సూచించారు. కంటికి సంబంధించిన కొన్ని సమస్యలు ఉండవచ్చు. బుధ గ్రహ విత్తన మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మంచి జరుగుతుంది.
Also Read : Poonam Kaur: రాహుల్ పప్పు కాదు.. భేటీ అనంతరం పూనమ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Also Read : Rishab Shetty Meets Rajinikanth : కాంతారాపై సూపర్ స్టార్ ప్రశంసలు.. తలైవా కాళ్లు మొక్కిన రిషభ్ శెట్టి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook