Mercury Transit in Capricorn 2024: తెలివితేటలకు కారకుడైన బుధుడు గమనంలో మార్పు ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. జాతకంలో మెర్క్యూరీ శుభస్థానంలో ఉంటే మీకు దేనికీ లోటు ఉండదు. బుధుడు ఫిబ్రవరి 1వ తేదీ మధ్యాహ్నం 2:08 గంటలకు మకరరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. బుధుడు రాశి మార్పు మెుత్తం 12 రాశులవారిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. బుధుడు మకరరాశి ప్రవేశం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిథునం(Gemini): ఫిబ్రవరి 01 తర్వాత మిథునరాశి వారి దశ తిరగబోతుంది. మిమ్మల్ని అదృష్టం వరించనుంది. మీకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ కూడా వస్తుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసేవారు లాభపడతారు. అయితే ఈ సమయంలో మీరు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది, అందుకే కాస్త జాగ్రత్తగా ఉండండి. వ్యాపారం బాగుంటుంది. మీకు మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. 
మేషం(Aries): మకర రాశిలో బుధుడు సంచారం మేష రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. మీకు అనుకున్న జాబ్ వస్తుంది. విదేశాలకు వెళ్లాలనే మీ కోరిక నెరవేరుతుంది. మీ ప్రతిభకు తగిన ప్రశంసలు లభిస్తాయి. మీ దారిద్ర్యం తొలగిపోతుంది. మీరు మీ లైఫ్ పార్టనర్ తో మంచి సమయం గడుపుతారు. మీ కెరీర్ అద్బుతంగా ఉంటుంది. మీరు భారీ లాభాలు పొందుతారు. 
సింహం (Leo): బుధుడి సంచారం సింహరాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. మీరు కుటుంబంతో కలిసి టూర్ కు వెళ్లే అవకాశం ఉంది. మీ ధనం విపరీతంగా పెరుగుతుంది. మీకు పదోన్నతితోపాటు జీతం పెరుగుతుంది. మీరు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో సరదాగా గడుపుతారు. మీరు శుభవార్త వినే అవకాశం ఉంది. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి.


Also read: Rajyog 2024: ఈ రోజు నుండి ఈ 3 రాశులకు దశ తిరగబోతుంది.. ఇందులో మీ రాశి ఉందా?


Also read: Ayodhya Ram Mandir Wishes: అయోధ్య రామ భక్తులందరికీ శ్రీరాముడి ప్రత్యేకమైన చిత్రాలు, కోట్స్, శుభాకాంక్షలు, వాట్సప్ పిక్స్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter