Ayodhya Ram Mandir Wishes In Telugu: కొన్ని శతాబ్దాల కల నెరవేరబోతోంది. జనవరి 22వ తేదీన అయోధ్యలోని రామ మందిర ప్రారంభోత్సవం జరగబోతోంది. ఇది అందరి భారతీయుల కల.. కాబట్టి ఇలాంటి రోజున శ్రీరాముడి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఈ కోట్స్ మీకోసమే..
Ayodhya Ram Mandir Pran Pratishtha Telugu Wishes, Status, Quotes, HD Photos: 500 సంవత్సరాల నుంచి కోట్లాదిమంది భారతీయులు లక్షలాది మంది రామభక్తుల కల నెరవేరింది. అయోధ్యలోని సరయు నది తీరాన శ్రీరాముడు కొలువుదీరబోతున్నాడు. మందిరం ప్రారంభోత్సవానికి సంబంధించిన పూర్తి పనులు ముగియగా.. రామజన్మభూమి ట్రస్ట్ అయోధ్య పట్టణాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసింది. కొన్ని శతాబ్దాల నుంచి రామ మందిరం కోసం ఎదురుచూస్తున్న వారి కళ జనవరి 22వ తేదీన నెరవేరబోతోంది. ఇలాంటి ఎంతో ప్రాముఖ్యమైన ఘట్టాన్ని తిలకించి ..ఆ రాముడు అనుగ్రహాన్ని పొందాలని మనసారా కోరుకుంటూ.. మీ స్నేహితులకు బంధువులకు కూడా శ్రీరాముడి అనుగ్రహం కలగాలని మేమందించే ప్రత్యేక కోట్స్, వాట్సాప్ పిక్స్ ను సోషల్ మీడియా ద్వారా పంపండి.
శ్రీరాముడు పాలించిన రాజ్యాంలో ప్రజలు ఎలాగైతే..ఎల్లప్పుడూ సుఖసంతోషాలు, ఆనందంగా ఉన్నారో..భారతీయులు కూడా అలాగే ఉండాలని కోరుకుంటూ..జైశ్రీరామ్..
శ్రీరాముడి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా కలిగి.. మీ కుటుంబం సుఖసంతోషాలు, ఆనందంతో ఉండాలని మనసారా కోరుకుంటూ..జైశ్రీరామ్..
ప్రతి ఒక్కరు శ్రీరాముడు నడిచిన అడుగుజాడల్లోనే నడవాలని మనసారా కోరుకుంటూ..జైశ్రీరామ్, జై జై శ్రీరామ్..
అన్ని నామాల్లో కెల్లా శ్రీరాముడి నామం ఎంతో గొప్పది.. అలాంటి నామాన్ని ప్రతిరోజు ఒక్కసారైనా నోటి నుంచి పలుకుతూ మీ జన్మను ధన్యం చేసుకోండి.. జైశ్రీరామ్, జై జై శ్రీరామ్..
సీతమ్మ తల్లి భర్త రాముడి అడుగుజాడల్లో సమస్యలు ఉన్న సమయాల్లో ఎలా నడిచిందో ప్రతి ఒక్క స్త్రీ అలానే ముందుండి కష్టాలతో పోరాడాలి. జైశ్రీరామ్, జై జై శ్రీరామ్..
ప్రతి ఒక్కరి జీవితంలో కష్ట సుఖాలు అనేవి సాధారణం.. ఎందుకంటే అంతటి శ్రీరాముడి జీవితమే కష్టాసుఖాల్లో కొనసాగింది. శ్రీరాముడి లాగా ముందుండి ప్రతి ఒక్కరూ కష్టాలను ఎదుర్కోవాలి.
శ్రీ సీతారాముల ఆశీర్వాదాలు ఎల్లవేళలా మీకు కలగాలని మనసారా కోరుకుంటూ జైశ్రీరామ్, జై జై శ్రీరామ్..
భక్తి ప్రేమ మార్గంలో నడుస్తూ జీవితంలో ఏదైనా సాధించవచ్చు అని తెలిపిన మహానుభావుడు శ్రీరాముడు.. అలాంటి రాముడి అనుగ్రహం ఎల్లవేళలా మీకు కలగాలని మనసారా కోరుకుంటున్నాం..