Mercury transit 2023: అక్టోబరు వరకు ఈ 3 రాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు.. ఇందులో మీ రాశి ఉందా?
Budh Gochar 2023: సంపద మరియు తెలివితేటలను ఇచ్చే బుధుడు సూర్యుడి రాశి అయిన సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఇతడి రాశి మార్పు మూడు రాశులవారికి అపారమైన ప్రయోజనాలను ఇవ్వనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Mercury transit 2023 in leo: మన జాతకంలోని గ్రహాలు, రాశుల స్థానాలను బట్టి ప్యూచర్ ను తెలుసుకుంటారు. ఆస్ట్రాలజీలో బుధుడిని గ్రహాల రాకుమారుడిగా పిలుస్తారు. అంతేకాకుండా ఇతడిని తెలివితేటలు, సంపద మరియు వ్యాపారానికి కారకుడిగా భావిస్తారు. మీ కుండలిలో బుధుడు శుభస్థానంలో ఉంటే మీకు దేనికీ లోటు ఉండదు. ప్రస్తుతం బుధుడు సూర్యుడి రాశి అయిన సింహరాశిలోకి సంచరిస్తున్నాడు. అక్టోబరు 01 వరకు అతడు ఇదే రాశిలో ఉంటాడు. మెర్క్యూరీ సంచారం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందనున్నారో తెలుసుకుందాం.
బుధుడి సంచారం ఈ రాశులకు వరం
వృషభరాశి
వృషభ రాశి వారికి బుధ సంచారం శుభప్రదంగా ఉంటుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీరు కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మీరు కోరుకున్న స్థానం లభిస్తుంది. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది.
మేష రాశి
బుధుడి సంచారం మేషరాశి వారికి మేలు చేస్తుంది. మీరు పూర్వీకుల ఆస్తి ద్వారా ప్రయోజనం పొందుతారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ఇతరులతో మీ వివాదం సద్దుమణుగుతుంది. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. మీకు ప్యామిలీ సపోర్టు లభిస్తుంది. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది.
తుల రాశి
బుధుడు రాశి మార్పు తుల రాశి వారికి ఒక వరం. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు. మీరు డబ్బును ఆదా చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి.
Also Read: Vaishno Devi Temple Trip: ఈ ఒక్క గుడికి వెళ్తే.. మరో 10 పర్యాటక ప్రదేశాలు చూడొచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook