Mercury Transit 2022: తులరాశిలో బుధుడు సంచారం...ఈ 4 రాశులకు కష్టకాలం...
Mercury Transit 2022: మరో నాలుగు రోజుల్లో బుధుడు తులరాశిలో సంచరించనున్నాడు. దీంతో నాలుగు రాశులవారికి కష్టాలు మెుదలుకానున్నాయి. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Mercury Transit 2022: గ్రహాల యువరాజైన బుధుడు తులరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈనెల 26న కన్యారాశిని విడిచిపెట్టి తులరాశిలోకి వెళతాడు. అప్పటికే సూర్యుడు, శుక్రుడు, కేతువులు తులారాశిలో ఉండటంతో వారితో సంయోగం జరుపుతాడు. తులరాశిలో బుధుడి సంచారం (Mercury Transit in Libra 2022) వల్ల నాలుగు రాశులవారు నవంబరు 19 వరుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవల్సి ఉంటుంది. ఈ బుధ సంచార సమయంలో ఏ రాశి వారికి ఇబ్బందులు ఎదురవుతాయో తెలుసుకుందాం.
బుధ సంచారం ఈ 4 రాశులపై ప్రతికూల ప్రభావం
వృషభరాశి (Taurus): తులారాశిలో బుధుడు సంచరించడం వల్ల వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి కాస్త కుదుటపడుతుంది. ఈ కాలంలో మీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఇది మీ బడ్జెట్ నాశనమయ్యే అవకాశం ఉంది. చర్మ సంబంధిత మరియు గొంతు సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ శత్రువుల పట్ల అప్రమత్తతో ఉండండి.
వృశ్చికరాశి (Scorpio): ప్రస్తుతం మీరు ఖర్చులను అదుపులో ఉంచుకోలేకపోతే ఆర్థిక సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎలాంటి వ్యాపారాలు చేయకండి. మీ పని ప్రదేశంలో ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసిన చిన్న పొరపాటును మీ ప్రత్యర్థులు సద్వినియోగం చేసుకోవచ్చు.
కుంభరాశి (Aquairus): ఈ సమయంలో కుంభరాశివారు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ శ్రమకు తగ్గ ఫలితం ఉండదు. మీ ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. దీంతో మీరు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మీ తోబట్టువులతో సంబంధం దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏ విషయంలోనూ వారితో వాదించకండి.
మీనరాశి(Pisces): ఈ సమయంలో మీరు కంటి సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు. కాబట్టి ఈ సమయంలో మీనరాశి వారు ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం మురికి ప్రదేశాలకు వెళ్లడం మానుకోండి. అంతేకాకుండా తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ తీసుకోండి.
Also Read: Guru Margi 2022: దీపావళి తరువాత నడవనున్న గురుడు... ఈ 4 రాశులవారికి పెరగనున్న అదృష్టం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook