Mercury Transit 2023: బుధ గోచారంతో ఈ మూడు రాశులకు అక్టోబర్ 1 నుంచి పట్టిందల్లా బంగారమే
Mercury Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారానికి విశిష్ట ప్రాధాన్యత ఉంటుంది. అదే సమయంలో ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కోలా పిలవడమే కాకుండా ఒక్కొక్క అంశానికి కారకంగా పరిగణిస్తుంటారు.
Mercury Transit 2023: జ్యోతిష్యం ప్రకారం బుధ గ్రహం కన్యా రాశిలో ప్రవేశించనుంది. కన్యా రాశి బుధుడి స్వరాశి కావడంతో భద్ర రాజయోగం ఏర్పడనుంది. ఫలితంగా మూడు రాశులవారికి అదృష్టం తోడుగా నిలుస్తుంది. కోరుకున్నది జరుగుతుంది.
బుధుడిని గ్రహాల రాజకుమారుడిగా పిలుస్తారు. అక్టోబర్ నెలలో చాలా ముఖ్యమైన గ్రహాలు గోచారం చేస్తున్నట్టే బుధుడి గోచారం కూడా ఉంది. బుధుడితో పాటు ఈ నెలలో మంగళం, సూర్య, శుక్ర, రాహు-కేతు గ్రహాలు గోచారం చేయనున్నాయి. ఫలితంగా కొన్ని రాశులవారికి అక్టోబర్ నెల అత్యంత కీలకం కానుంది. అక్టోబర్ 1వ తేదీన గ్రహాల రాజకుమారుడు బుధుడు కన్యా రాశిలో ప్రవేశించడం వల్ల ఏర్పడే భద్ర రాజయోగంతో వివిధ అంశాలపై ప్రభావం పడుతుంది. ధనలాభం కలుగుుతంది. ముఖ్యంగా ఈ మూడు రాశులవారికి ఆకశ్మిక ధనలాభం ఉంటుంది.
బుధుడి కన్యా రాశి ప్రవేశంతో ఏర్పడనున్న భద్ర రాజయోగం ప్రభావం మకర రాశిపై చాలా శుభప్రదంగా ఉంటుంది. విదేశాలకు చదువు నిమిత్తం వెళ్లాలనుకునేవారి కోరిక నెరవేరుతుంది. జీవితం మరింతగా మెరుగుపడుతుంది. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేయవచ్చు. ప్రయాణాలు తప్పవు. అదృష్టం తోడుగా ఉండటంతో అనుకున్నవన్నీ జరుగుతాయి. వ్యాపారులకు ఊహించని లాభాలు కలుగుతాయి. ఉద్యోగులకు పదోన్నతి ఉంటుంది. ఆర్ధికంగా పటిష్టంగా ఉంటారు.
భద్ర రాజయోగం కారణంగా ధనస్సు రాశి జాతకులు కొత్త పనులు ప్రారంబించవచ్చు. వ్యాపారులకు అనువైన సమయం. అందరి సహకారం లభిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతి లేదా కొత్త ఉద్యోగావకాశాలుంటాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆకశ్మిక ధనలాభం ఉంటుంది. ఫలితంగా ఆర్ధికంగా పటిష్టమైన స్థితిని కలిగి ఉంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
బుధుడి కన్యా రాశిలో ప్రవేశించడంతో కన్యా రాశి జాతకుల్లో వ్యాపారులకు చాలా మంచి సమయంగా చెప్పాలి. ప్రతి రంగంలో చక్కని పనితీరు కనబరుస్తారు. పనితీరు, వ్యవహారం ఇలా వివిధ అంశాల్లో మార్పు ఉంటుంది. వ్యాపారులు అమితమైన లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు అంతా బాగుంటుంది. పనిచేసేచోట గుర్తింపు లభిస్తుంది. ఆర్ధికంగా బాగుంటుంది. ఎలాంటి సమస్యలు రావు.
Also read: Mars Transit 2023: దీపావళి వరకూ ఆ 3 రాశులకు తిరుగుండదు, వద్దంటే డబ్బు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook