COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Mercury Transits 2024: గ్రహ సంచారాల పరంగా బుధ గ్రహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. బుధుడు జాతకంలో శుభ స్థానంలో ఉంటే ఎలాంటి పనుల్లోనైనా సులభంగా విజయాలు సాధిస్తారు. అదే ఈ గ్రహం అశుభ స్థానంలో ఉంటే అనేక సమస్యలు వస్తాయి. ఇదిలా ఉంటే ఆగస్టు 22న బుధుడు రాశి సంచారం చేయబోతున్నాడు. ఈ గ్రహం సింహ రాశి నుంచి కర్కాటక రాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారిపై అశుభ ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశులవారికి వృత్తి, ఆదాయం, ఆరోగ్యంపై ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతుంది. అయితే ఈ గ్రహం సెప్టెంబర్ 4 వరకు కర్కాటక రాశిలో ఉంటుంది. కాబట్టి అప్పటి వారికు ఈ తీవ్ర ప్రభావం కొనసాగుతుంది. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారు జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..


సింహరాశి:
కర్కాటక రాశిలోకి బుధుడు తిరోగమనం చేయడం వల్ల సింహ రాశివారిపై ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతుంది. దీని కారణంగా సింహ రాశివారు ఈ సమయంలో అనేక సమస్యలు ఎదర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో డబ్బు సంబంధిత విషయాల్లో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా కోర్టుకు సంబంధించిన కేసుల్లో అనేక సమస్యలు వస్తాయి. అలాగే ప్రభుత్వాల నుంచి నోటీసులు వచ్చే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ఆర్థిక సమస్యలు కూడా రెట్టింపు అవుతాయి. అంతేకాకుండా ఖర్చులు ఊహించని వాటి కంటే ఎక్కువగా పెరుగుతాయి. డబ్బు ఖర్చు చేసే సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 


ధనుస్సు రాశి:
ఈ బుధుడి సంచారం ధనుస్సు రాశివారిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా వీరు అనేక సవాళ్లను ఎదుర్కొరు అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా భాగస్వామ్య జీవితం గడుపుతున్నవారికి  కొన్ని చిక్కులు కూడా వస్తాయి. అలాగే భార్యతో విభేదాలు కూడా వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. దీంతో పాటు వ్యాపారాలు చేసేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే అనేక సమస్యలు వచ్చే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. 


కుంభ రాశి:
కుంభ రాశివారిపై కూడా బుధుడి అశుభ ప్రభావం పడుతుంది. దీని కారణంగా వీరి ఆరోగ్యం మరింత క్షీణించే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా శత్రువులతో హాని కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే కొన్ని పరిస్థితుల్లో సిక్రెట్‌గా ఉండడం ఎంతో మంచిది. లేకపోతే అనేక సమస్యల బారిన పడే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. వీరు సెప్టెంబర్‌ వరకు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. దీంతో పాటు వ్యాపారాలు చేస్తున్న వారికి డబ్బులు కూడా నిలిపోతాయి. కాబట్టి వీరు నగదు బదిలి చేసే క్రమంలో ఎంతో జాగ్రత్తగా ఉండండి..


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.