Rajyog 2023: 50 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 3 రాశులకు ఆకస్మిక ధనలాభం..
Trigrahi Yog 2023 effect: ఇటీవల సింహరాశిలో బుధుడు, శుక్రుడు మరియు కుజుడు కలయిక వల్ల అరుదైన యోగం ఏర్పడుతుంది. ఇది మూడు రాశులవారికి లాభాలను ఇస్తుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Trigrahi Yog 2023 in leo: గ్రహాలు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించడం వల్ల ఇతర గ్రహాలతో సంబంధాలు పెట్టుకుంటాయి. దీంతో కొన్ని యోగాలు ఏర్పడతాయి. ఇవి కొన్ని రాశులవారికి శుభప్రదంగా, మరికొన్ని రాశులవారికి అశుభకరంగా ఉంటాయి. ఇటీవల బుధ గ్రహం సింహరాశిలోకి ప్రవేశించింది. ఇప్పటికే శుక్రడు, కుజుడు అదే రాశిలో సంచరిస్తున్నారు. సింహరాశిలో ఈ మూడు గ్రహాల కలయిక వల్ల అరుదైన త్రిగ్రాహి యోగం(Trigrahi Yog 2023) ఏర్పడుతోంది. ఈ యోగం వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
తుల రాశి: త్రిగ్రాహి యోగం తులారాశి వారికి కలిసి వస్తుంది. వీరి ఆదాయం భారీగా పెరుగుతుంది. దీంతో వీరి బ్యాంక్ బ్యాలెన్స్ రెట్టింపు అవుతుంది. డబ్బును ఆదా చేస్తారు. పార్టనర్ షిప్ తో చేసే వ్యాపారంలో లాభం ఉంటుంది. జాబ్ చేసేవారికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది.
సింహం: ఇదే రాశిలో త్రిగ్రాహి ఏర్పడుతోంది. దీంతో ఈ రాశి వారికి సడన్ గా డబ్బు అందుతుంది. వీరి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పెద్ద పదవి లభించే అవకాశం ఉంది. మీరు విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ లైఫ్ ఆనందంగా ఉంటుంది.
కుంభం: బుధుడు, శుక్రుడు మరియు కుజుడు కలయిక ఈ రాశివారికి లాభాలను ఇస్తుంది. దీంతో మీరు ఆర్థికంగా బలపడతారు. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. మీ ఆరోగ్యం బాగుంటుంది. మెుత్తానికి ఈ సమయంలో మీరు ఏ కార్యం చేపట్టినా అది విజయవంతమవుతుంది.
Also Read: Solar eclipse 2023: రాబోయే సూర్యగ్రహణం ఈ రాశులకు ప్రమాదకరం.. ఇందులో మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook