COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Mercury-Venus Transit: గ్రహాల రాకుమారుడు శుక్రుడు, బుధుడు ఒకే రాశిలో కలవబోతున్నాయి. ఇలా కలవడం జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో శుభప్రదమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. డిసెంబర్ 25 తేదిన ఉదయం 06:33 గంటలకు శుక్రుడు వృశ్చికరాశిలోకి, బుధుడు డిసెంబరు 28న తిరోగమనంలో  వృశ్చికరాశిలో సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా లక్ష్మీనారాయణ యోగం ఏర్పడబోతోంది. ఈ యోగం కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. ఈ యోగం కారణంగా ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


ఈ రాశులవారిపై ప్రత్యేక ప్రభావం:
వృశ్చిక రాశి: 

వృశ్చిక రాశి వారికి లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడటం కారణంగా భారీ లాభాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యలన్నీ సులభంగా తొలగిపోతాయి. ఆదాయం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఆలోచించి డబ్బులను వ్యాపారాల్లో పెట్టడం వల్ల విపరీతమైన లాభాలు పొందుతారు. ప్రేమ జీవితం అనుభవిస్తున్నవారికి శృంగారం అనుకూలంగా ఉంటుంది. కెరీర్‌ జీవితం కూడా చాలా బాగుటుంది. అనారోగ్య సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. 


మిథున రాశి:
ఈ రెండు గ్రహాలు వృశ్చిక రాశిలో కలవడం కారణంగా ఏర్పడే లక్ష్మీ నారాయణ యోగం కారణంగా ఊహించని లాభాలు కలుగుతాయి. వ్యాపారాల్లో కూడా అనేక రకాల లాభాలు కలుగుతాయి. సమాజంలో గౌరవం కూడా లభిస్తుంది. ఉద్యోగాలు చేస్తున్నవారు కొత్త ఉద్యోగ ఆఫర్లను కూడా పొందుతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి. ఇక ఎప్పటి నుంచో ఎదురవుతున్న సమస్యలన్నీ సులభంగా తొలగిపోతాయి. 


Also Read: Vivo Y27 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo Y27 మొబైల్‌ కేవలం రూ.12,499కే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు.. 


కుంభ రాశి:
లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడటం కుంభ రాశి వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఈ సమయంలో తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా పిల్లల నుంచి కూడా కొన్ని శుభవార్తలను అందుకుంటారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభించింది. వ్యాపారాల్లో కూడా అనేక రకాల లాభాలు కలుగుతాయి. 


Also Read: Vivo Y27 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo Y27 మొబైల్‌ కేవలం రూ.12,499కే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి