Budh Gochar in Kumbh Rashi 2024: మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. 2024 సంవత్సరం ప్రారంభంలో గ్రహాల యువరాజైన బుధుడు తన రాశిని మార్చబోతున్నాడు. తెలివితేటలు మరియు స్కిల్స్ కారకుడైన మెర్క్యూరీ వచ్చే ఏడాది మెుదట్లో కుంభరాశిలో సంచరించబోతున్నారు.  కుంభరాశికి అధిపతిగా శనిదేవుడిని భావిస్తారు. బుధుడికి, శనిదేవుడు పైగా మిత్రులు. న్యూ ఇయర్ లో బుధుడు రాశి మార్పు వల్ల ఏ రాశులవారి తలరాత మారబోతుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మకరరాశి
న్యూ ఇయర్ లో కుంభరాశిలో బుధుడు ప్రవేశం మకర రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. మీరు కెరీర్ లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. మీకు అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. 
మేషరాశి
బుధుడి రాశి మార్పు వల్ల 2024లో మేషరాశి వారి ఆదాయం పెరుగుతుంది. దీంతో వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. 
మిధునరాశి
మెర్క్యురీ సంచారం వల్ల మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీకు లక్ కలిసి వస్తుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. దంపతులకు సంతానప్రాప్తి కలుగుతుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా లభిస్తుంది. 


Also Read: Guru Shukra Yuti: 12 ఏళ్ల తర్వాత కలవబోతున్న బృహస్పతి- శుక్రుడు.. 2024లో ఈ రాశులకు జాబ్, ప్రమోషన్ పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి