Mercury enter in Taurus on 07th June 2023: జూన్ మెుదటి వారంలో వృషభంలోకి బుధుడు.. ఈ రాశులకు లాభాలు బోలెడు

Budh Gochar on 07th June 2023: గ్రహాల యువరాజు బుధుడు జూన్ నెలలో వృషభరాశి ప్రవేశం చేయనున్నాడు. మెర్క్యూరీ యెుక్క రాశి మార్పు కారణంగా నాలుగు రాశులవారు మంచి ప్రయోజనాలు పొందబోతున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Budh Gochar on 07th June 2023: ఆస్ట్రాలజీలో బుధుడిని గ్రహాల రాకుమారుడు అని పిలుస్తారు. మెర్క్యూరీ ఫ్లానెట్ జూన్ 7న సాయంత్రం 07:58కి వృషభరాశిలో సంచరించనుంది. ఇదే రాశిలో జూన్ 23 వరకు ఉండి.. జూన్ 24వ తేదీ మధ్యాహ్నం 12:48 గంటలకు మిథునరాశిలోకి ఎంటర్ అవుతుంది. మరోవైపు జూన్ 21వ తేదీ తెల్లవారు జామున 04.35 గంటలకు మెర్క్యూరీ వృషభరాశిలో అస్తమిస్తుంది. ప్రస్తుతం బుధుడు మేషరాశిలో కూర్చున్నాడు. బుధుడి రాశి మార్పు వల్ల నాలుగు రాశులవారు విపరీతమైన ప్రయోజనాలు పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
వృషభం
ఇదే రాశిలో బుధుడి సంచారం జరగబోతుంది. ఇది వృషభరాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. ఈ రాశి వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది.
మీనం
గ్రహాల యువరాజు సంచారం వల్ల వల్ల మీనరాశి వారికి కొత్త జాబ్ వస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు శుభవార్తను వింటారు. వ్యాపారులు మంచి లాభాలను ఆర్జిస్తారు. మీరు ఆర్థికంగా బలపడతారు. మీకు అదృష్టం కలిసి వచ్చి ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు.
Also Read: Cheapest Bike: డెడ్ ఛీప్ ధరలతో అత్యధిక మైలేజీనిచ్చే బైక్ ఇదే..లీటర్‌కు మైలేజీ ఎంతిస్తుందో తెలుసా?
కన్య
మెర్క్యూరీ సంచారం కన్యారాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు అనుకున్నది సాధిస్తారు. కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూసే వారి కోరిక ఫలిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ప్రయోజనం పొందుతారు. బిజినెస్ చేసేవారు భారీగా లాభాలను గడిస్తారు.
మకరం
బుధుడి ట్రాన్సిట్ మకర రాశి వారికి మంచి లాభాలను ఇస్తుంది. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. మీరు కెరీర్ లో ఉన్నతస్థాయికి చేరుకుంటారు. మీరు అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ సక్సెస్ అవుతారు. ఉద్యోగ, వ్యాపారులు మంచి ప్రయోజనాలు పొందుతారు.
Also Read: Shukra Gochar 2023: రాబోయే 37 రోజులపాటు వీరికి ఊహించనంత డబ్బు.. మీ రాశి ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook