Bike Under Rs 60,000: డెడ్‌ ఛీప్‌ ధరతో అత్యధిక మైలేజీనిచ్చే బైక్‌.. లీటర్‌కు 83 కిలో మీటర్ల మైలేజీ!

Cheapest Bike Under 60,000 Rupees only: డెడ్‌ ఛీప్‌ ధరల మార్కెట్‌లో చాలా రకాల బైక్‌లున్న హీరో హెచ్ఎఫ్ డీలక్స్‌కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ బైక్‌లో చాలా రకాల కొత్త ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్‌కు సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 3, 2023, 07:36 PM IST
Bike Under Rs 60,000: డెడ్‌ ఛీప్‌ ధరతో అత్యధిక మైలేజీనిచ్చే బైక్‌.. లీటర్‌కు 83 కిలో మీటర్ల మైలేజీ!

Cheapest Bike Under 60,000 Rupees only: భారత్‌ తక్కువ బడ్జెట్‌ ధరల్లో లభించే బైక్‌లకు మంచి డిమాండ్‌ ఉంది. ప్రజలు వీటిని ఎక్కువగా ఆఫీసు, మార్కెట్ లేదా కాలేజీకి వెళ్లడానికి వినియోగిస్తారు. భారత్‌లో పెట్రోల్‌ ధరలు రోజురోజుకు పెరగడం కారణంగా జనాలు కూడా ఇలాంటి బైక్‌లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు.

వీటిని వల్ల ఎక్కువ మైలేజీని పొందడమేకాకుండా ట్రాఫిక్‌లో కూడా సులభంగా వెళ్లేందుకు సౌకర్యంగా ఉంటుంది. మీరు కూడా ఇలాంటి బైక్‌ను కొనుగోలు చేయాలనుకుంటే హీరో మోటార్‌సైకిల్స్ రూపొందిన హెచ్‌ఎఫ్ డీలక్స్‌ను కొనుగోలు చేయోచ్చు. దీని వల్ల  కస్టమర్లకు చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. వినియోగదారులు కేవలం ఈ బైక్‌లో లీటర్‌ పెట్రోల్‌ కొట్టిస్తే.. దాదాపు  83 kmpl మైలేజీని పొందవచ్చు.

భారత దేశంలో పలు ప్రాంతాల్లో హెచ్ఎఫ్ డీలక్స్ డీలక్స్ (డ్రమ్ బ్రేక్ + కిక్ స్టార్ట్ వేరియంట్) ధర రూ.60760 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఇదే బైక్‌లో టాప్‌ ఎండ్‌ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. ఈ టాప్‌ ఎండ్‌ వేరియంట్‌ను కొనుగోలు చేసేవారికి కేవలం రూ.67,000 లలో ఈ బైక్‌ లభిస్తోంది.

అంతేకాకుండా ఈ బైక్‌ ప్రస్తుతం 8 కలర్స్‌లో లభిస్తోంది. ప్రస్తుతం హెచ్ఎఫ్ డీలక్స్ బైక్‌ మార్కెట్‌లోని బజాజ్ CT100, TVS స్పోర్ట్, హోండా CD 110 డ్రీమ్ వంటి బడ్జెట్‌ బైక్‌లతో పోటీ పడుతుంది. ఈ బైక్‌లో చాలా రకాల కొత్త ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. 

Also Read: Mars transit 2023: జూలై 01 వరకు ఈ 3 రాశులకు డబ్బే డబ్బు.. ఇందులో మీరున్నారా?

ఇంజన్, ఫీచర్ల వివరాలు ఇవే:
హీరో హెచ్ఎఫ్ డీలక్స్ 97.2సీసీ ఇంజన్‌ మార్కెట్‌లో లభిస్తోంది. ఈ ప్రత్యేకమైన ఇంజన్‌ 7.91 బిహెచ్‌పి పవర్ సమర్థ్యంతో..8.05 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌ ముందు చక్రానికి, వెనక చక్రానికి  డ్రమ్ బ్రేక్‌లు కలిగి ఉన్నాయి. అంతేకాకుండా కంబైన్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS) కూడా అందుబాటులో ఉంది. కాబట్టి మీరు ఈ బైక్‌ సురక్షిత ప్రయాణాన్ని చేయోచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో హీరో హెచ్ఎఫ్ డీలక్స్ నాలుగు వేరియంట్స్‌లో లభిస్తోంది. 

బైక్ ఫీచర్ల:
✺ స్పీడోమీటర్
✺ ఓడోమీటర్
✺ ఫ్యూయల్ గేజ్‌
✺ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
✺ హాలోజన్ హెడ్‌లైట్‌
✺ ఇంజన్ ఫ్యూయల్-ఇంజెక్షన్ సిస్టమ్
✺ ఎక్స్‌సెన్స్ టెక్నాలజీ
✺ ఐడిల్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్
✺ i3S సిస్టమ్ 
✺ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్
✺ ఇంజన్ షట్‌డౌన్

Also Read: Mars transit 2023: జూలై 01 వరకు ఈ 3 రాశులకు డబ్బే డబ్బు.. ఇందులో మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x