Mercury transit 2023: జూలై 25న సూర్యుడి రాశిలోకి బుధుడు.. ఈ 3 రాశులవారికి ప్రత్యేక ప్రయోజనం..
Mercury transit 2023: గ్రహాల యువరాజైన బుధుడు త్వరలో సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. అంతేకాకుండా సూర్యుడు కలిసి బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరచనున్నారు. బుధుడి సంచారం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందనున్నారో తెలుసుకుందాం.
Budh Gochar 2023 in July: ఆస్ట్రాలజీలో బుధుడిని గ్రహాల రాకుమారుడు అని పిలుస్తారు. మెర్క్యూరీ స్థానంలో మార్పు మీ ఆర్థిక స్థితి, వృత్తి, వ్యాపారాన్ని ప్రభావితం చేస్తుంది. జాతకంలో బుధుడు శుభప్రదంగా ఉంటే మీకు దేనికీ లోటు ఉండదు. జూలై 25న బధుడు సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అంతేకాకుండాఅదే రాశిలో బుధుడు, సూర్యుడు కలిసి బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. బుధ సంచారం మూడు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. మెర్క్యూరీ రాశి మార్పు ఏయే రాశులవారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.
వృషభం: వృషభ రాశి వారికి బుధ సంచారం ఎంతో మేలు చేస్తుంది. ఆగిపోయిన పని పూర్తవుతుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీరు ఈ సమయంలో శుభవార్తలు వింటారు. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. దీని వల్ల మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. మీరు రుణాన్ని తిరిగి చెల్లిస్తారు.
తులా రాశి : బుధుడు రాశి మారడం వల్ల తుల రాశి వారికి చాలా డబ్బు వస్తుంది. మీకు కొత్త ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సమకూరుతుంది. మీరు కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మీరు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు సేవ చేస్తారు.
Also Read: Astrology: ఈ రోజు నుండి ఈ 4 రాశులకు మహార్దశ.. ఇందులో మీ రాశి ఉందా?
మకరం: బుధగ్రహ సంచారం మకర రాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీరు పెట్టుబడులు పెట్టడం ద్వారా ప్రయోజనం పొందుతారు. మీరు భారీ మెుత్తంలో ఆస్తిని కొనుగోలు చేస్తారు. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ లవ్ లైవ్ బాగంటుంది. పరిశోధన రంగంలో ఉన్నవారు ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు.
Also Read: Surya Gochar 2023: ఆగష్టు 17 వరకు ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు.. మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook