Surya Gochar 2023 today: సాధారణంగా గ్రహాలు రాశి మార్పు అన్ని రాశులవారిని ప్రభావితం చేస్తుంది. నెలకొకసారి గ్రహాల రాజు సూర్యుడు తన రాశిని మారుస్తాడు. ఇవాళ అంటే జూలై 16న సూర్యుడు మిథునరాశిని విడిచిపెట్టి కర్కాటక రాశిలోకి ప్రవేశింబోతున్నాడు. ఆగస్టు 17 వరకు అక్కడే ఉంటాడు. ఏ వ్యక్తి యెుక్క జాతకంలో సూర్యుడు శుభప్రదంగా ఉంటాడో వారికి దేనికీ లోటు ఉండదు. సూర్య సంచారం ఏ రాశులవారికి ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకుందాం.
మేషరాశి
సూర్యుడి రాశి మార్పు మేషరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు. డబ్బు లావాదేవీలు చేయడం వల్ల మీరు ఎక్కువ ప్రయోజనం పొందుతారు.
కర్కాటక రాశి
భానుడు రాశి మార్పు వల్ల కర్కాటక రాశి వారికి కలిసి రానుంది. మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీరు డబ్బు సంబంధిత సమస్యల నుండి బయటపడతారు. జీవిత భాగస్వామితో సమయం గడుపుతారు. విద్యారంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రయోజనం పొందుతారు.
మిధునరాశి
ఆదిత్యుడి సంచారం మిథునరాశి వారికి అనుకూల ఫలితాలను ఇస్తుంది. ఆగిపోయిన పని పూర్తవుతుంది. పని ప్రదేశంలో గౌరవం లభిస్తుంది. ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. మీ ఆదాయం పెరుగుతుంది. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. మీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో విజయం సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
Also Read: Shani Margi 2023: త్వరలో కుంభరాశిలో నేరుగా నడవనున్న శని.. ఈ 3 రాశులకు మంచి రోజులు మెుదలు..
ధనుస్సు రాశి
కర్కాటక రాశిలోకి సూర్యుని ప్రవేశం ధనుస్సు రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. వ్యాపారులు లాభపడతారు. ధార్మిక, ఆధ్యాత్మిక కార్యాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ధనలాభం ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
Also Read: Rudrkaksha Benefits: రుద్రాక్షను చేతికి ధరిస్తే ఏమౌతుందో తెలుసా, రుద్రాక్షను అలా ధరించవచ్చా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook