Budh Gochar In Mesh 2023: గ్రహాల రాకుమారుడైన బుధుడు ఈ నెల చివరిలో అంటే మార్చి 31న మీనరాశిని విడిచిపెట్టి మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. బుధుడు తన బలహీనమైన మీన రాశి నుండి బయటకు వెళ్లి అంగారక రాశి అయిన మేషరాశికి వెళ్లడం వల్ల కొన్ని రాశులవారు అపారమైన ప్రయోజనాలు పొందనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి..


జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మేష రాశి వారి లగ్న గృహంలో బుధ సంచారం జరగబోతోంది. మెర్క్యూరీ రవాణా కారణంగా మీలో ధైర్యం పెరుగుతుంది. ఈ సమయం బ్యాంకింగ్ మరియు మీడియా రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఉపయోగకరంగా ఉంటుంది. మేషరాశి వారు ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగం మారడానికి ఇదే అనుకూల సమయం. మీరు చేపట్టినా ఏ పనినైనా విజయవంతంగా పూర్తిచేస్తారు. 


కర్కాటక రాశి..


ఈ రాశిచక్రంలోని పదవ ఇంట్లో బుధుడు సంచరించబోతున్నాడు. దీనిని కర్మ గృహంగా భావిస్తారు. బుధగ్రహ ప్రభావం వల్ల ఈ రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. మీరు కొత్త బాధ్యతలు తీసుకుంటారు. కుటుంబంతో మంచి సమయం గడపుతారు. మీ తల్లి ఆరోగ్యం కుదుట పడుతుంది. 


కుంభ రాశి..


బుధుడు ఈ రాశి యెుక్క మూడవ ఇంట్లో సంచరించబోతున్నాడు. మీరు ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. మీకు ప్రతి పనిలోనూ అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారులు భారీగా లాభపడతారు. పెట్టుబడి పెట్టడానికి ఇదే అనుకూల సమయం. మెుత్తానికి ఈ టైం మీకు కలిసి వస్తుంది. మీరు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి.  


Also Read: Ugadi Festival 2023: ఉగాది పండగ రోజు ఈ ప్రత్యేక వస్తువును ఇంటికి తీసుకెళ్లండి.. ఏడాదంతా డబ్బేడబ్బు! మంచి ఆరోగ్యం 


Also Read: Rs 1 lakh Monthly Salary Job: మీకు మీమ్స్ చేయడం వచ్చా ? నెలకు లక్ష రూపాయల శాలరీ ఇచ్చే జాబ్ రెడీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి