Money Rain Will fall on These 3 zodiac signs due to Kendra Trikona Raj Yoga 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం... ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో తన రాశి చక్రాన్ని మారుస్తుంటుంది. ఒక గ్రహం రాశి చక్రంలో సంచరించినప్పుడు.. దానిని 'గ్రహ సంచారం' లేదా 'గ్రహ రాశి మార్పు' అంటారు. ఈ గ్రహ సంచారం అన్ని రాశి చక్ర గుర్తుల ప్రజలను ప్రభావితం చేస్తుంది. గ్రహాల రాకుమారుడు బుధుడు.. 2023 ఫిబ్రవరి నెల ప్రారంభంలో మకర రాశిలో సంచరించబోతున్నాడు. ఈ సంచారంతో 'కేంద్ర త్రికోణ రాజయోగం' ఏర్పడుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్య శాస్త్రంలో 'కేంద్ర త్రికోణ రాజయోగం' చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. బుధుడి రాశి మార్పు మొత్తం 12 రాశులను ప్రభావితం చేసినప్పటికీ.. ముఖ్యంగా ఈ 3 రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు అందిస్తుంది. మేష రాశి, మకర రాశి, తులా రాశి ప్రజలకు బుధ సంచారం వలన ఏర్పడే కేంద్ర త్రికోణ రాజయోగం చాలా శుభప్రదంగా ఉండనుంది. 


మేష రాశి:
మేష రాశి వారిపై బుధ సంచారం శుభ ప్రభావం చూపుతుంది. బుధుడి రాశి మార్పు ద్వారా ఏర్పడిన కేంద్ర త్రికోణ రాజయోగం మేష రాశి దశమంలో ఏర్పడుతుంది. దీనివల్ల ప్రతి పనిలో విజయం లభిస్తుంది. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కార్యాలయంలో ప్రతిష్ట మరియు గౌరవం పెరుగుతుంది. వ్యాపారస్తులు అధిక లాభాలు పొందుతారు.


మకర రాశి:
ఫిబ్రవరి ప్రారంభంలో బుధుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దాంతో మకర రాశి వారికి ఈ సంచారం మంచి ప్రయోజనాలను ఇస్తుంది. కేంద్ర త్రికోణ రాజయోగం ఈ రాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలను అందిస్తుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. అవివాహితులు వివాహం చేసుకుంటారు. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. అధిక ధన లాభం ఉంటుంది. 


తులా రాశి:
తులా రాశి నాల్గవ ఇంటిలో బుధుడు సంచరిస్తాడు. ఈ సంచారం వలన ఏర్పడిన కేంద్ర త్రికోణ రాజయోగం తులా రాశి వారికి అనుకూలమైన ఫలితాలను తెస్తుంది. ఈ సమయంలో భౌతిక సుఖాలు పెరిగే అవకాశం ఉంది. వాహనం, ఆస్తి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆస్తికి సంబంధించిన పనులు చేయడం ఫలవంతంగా ఉంటాయి.


Also Read: Sun Transit 2023: జనవరి 14న మకర రాశిలోకి సూర్యుడు.. ఈ 4 రాశుల వారికి గోల్డెన్ డేస్ మొదలు! రాకెట్ వేగంతో విజయాలు  


Also Read: Divi Vadthya Hot Pics: పొట్టి నిక్కరులో దివి వైద్య.. నాభి, థైస్ అందాలతో పిచ్చెక్కిస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.