Masik Rashifal December 2022: జ్యోతిష్యం పరంగా చూస్తే 2022 డిసెంబర్ నెల చాలా ముఖ్యమైనది. ఈ నెలలో 3 ముఖ్యమైన గ్రహాలు రాశిచక్రాన్ని మార్చబోతున్నాయి. ఈ గ్రహాల సంచారం మొత్తం 12 రాశిచక్రాలపై శుభ మరియు అశుభ ప్రభావాలను కలిగి ఉంటుంది. గ్రహాల సంచారం పరంగా ఈ మాసం చాలా విశిష్టమైనది. . డిసెంబర్ 3, 2022న బుధుడు డిసెంబర్ 5న శుక్రుడు, డిసెంబర్ 16న సూర్యుడు సంచరించనున్నాడు. ఈ ఏడాది చివరి నెలలో బుధుడు, శుక్రుడు మరియు సూర్యుడి సంచారం మూడు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇది మాత్రమే కాదు, డిసెంబర్ 2022లో బుధుడు మరియు శుక్ర గ్రహాలు రాశిని ఒకసారి కాదు రెండుసార్లు మారుస్తాయి. డిసెంబర్ 3 తర్వాత బుధ గ్రహం మళ్లీ డిసెంబర్ 27న వృషభ రాశిలోకి ప్రవేశిస్తుంది. మరోవైపు డిసెంబర్ 29న శుక్రుడు మకరరాశిలో సంచరించనున్నాడు.


మిథునం (Gemini): మిథునరాశి వారికి డిసెంబర్‌లో జరిగే గ్రహ సంచారాలు చాలా శుభప్రదంగా ఉంటాయి. ఈ రాశివారు కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు. ఆదాయ వనరులు పెరుగుతాయి. వ్యాపారంలో భారీగా లాభం ఉంటుంది. ఆస్తి ద్వారా లాభం పొందుతారు. కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంది. 
వృశ్చికం (Scorpio): డిసెంబర్ నెల కూడా వృశ్చిక రాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. చెడిపోయిన పనులు ప్రారంభమవుతాయి. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. మీరు వేసుకున్న ప్రణాళికలు నెరవేరుతాయి. ఇంట్లో ఆనందం నెలకొంటుంది. వృత్తి జీవితం బాగుంటుంది. విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. 
మకరం (Capricorn): డిసెంబర్ నెలలో బుధ, శుక్ర, సూర్యుని సంచారం మకర రాశి వారికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. కెరీర్ లో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. ధనం లాభదాయకంగా ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. 


Also Read: Mangal Gochar 2022: వచ్చే 4 నెలలు ఈ రాశులవారి జీవితం అల్లకల్లోలం... ఇందులో మీరున్నారా.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook