Monthly Horoscope February 2023:  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఫిబ్రవరి నెలలో బుధుడు, శుక్రుడు మరియు సూర్యుడు సంచరించబోతున్నారు. ఒకే నెలలో ఈ గ్రహాల యొక్క సంచారం మెుత్తం 12 రాశులవారిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ఫిబ్రవరి నెల నాలుగు రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. . ఫిబ్రవరి నెలలో ఏ రాశి వారి అదృష్టం ప్రకాశించబోతుందో నెలవారీ జాతకాన్ని బట్టి తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫిబ్రవరిలో అదృష్ట రాశులివే..
మేషం: మేష రాశి వారికి ఫిబ్రవరి నెల చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈరాశి వారు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. కొత్త మార్గాల ద్వారా డబ్బును పొందుతారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. 
వృషభం: వీరు కెరీర్‌లో గొప్ప విజయాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మీకు కొత్త జాబ్ వస్తుంది. ఉద్యోగులకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. బిజినెస్ విస్తరిస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మీరు దీర్ఘకాలిక వ్యాధి నుండి బయటపడతారు. ప్రేమ జీవితం బాగుంటుంది. పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. 
కన్య: ఈరాశి వారికి ఫిబ్రవరి నెల మేలు చేస్తుంది. వృత్తిలో పురోగతి ఉంటుంది. మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీరు డబ్బును ఆదా చేస్తారు.
ధనుస్సు: ఫిబ్రవరి నెల ధనుస్సు రాశి వారికి కెరీర్‌కు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ప్రమోషన్-ఇంక్రిమెంట్ పొందవచ్చు. కెరీర్‌లో కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థిక ప్రయోజనాలను పొందే బలమైన అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమ, వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.


Also Read: Shani Dev: మరో 5 రోజుల్లో అస్తమించనున్న శనిదేవుడు.. ఈ రాశులవారు ధనవంతులవ్వడం పక్కా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook