SBI Clerk Notification 2024: ఇది బ్యాంకు ఉద్యోగం చేయాలనుకునే అభ్యర్థులకు గుడ్ న్యూస్ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నవారికి ఈ నోటిఫికేషన్ తీపి కబురు. ఈ ఉద్యోగల భర్తీకి సంబంధించిన వివరాలు ఈ నెల చివరికి వివరణాత్మకంగా రానుంది.
SBI Clerk Notification 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ త్వరలో ప్రారంభించనుంది. 2024కు గాను అక్టోబర్ లేదా నవంబర్ నెలలో ఎస్‌బీఐ ఈ నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తుల స్వీకరణ చేపట్టనుంది. ఇది బ్యాంకు ఉద్యోగం చేయాలనుకునే అభ్యర్థులకు గుడ్ న్యూస్ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నవారికి ఈ నోటిఫికేషన్ తీపి కబురు. ఈ ఉద్యోగల భర్తీకి సంబంధించిన వివరాలు ఈ నెల చివరికి వివరణాత్మకంగా రానుంది.
ఎస్‌బీఐ బ్యాంకులో జాబ్ చేయాలనుకునేవారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. మరో నాలుగు వారాల్లో ఈ దరఖాస్తులకు సంబంధించిన అప్లిక్లేషన్స్ స్వీకరణ చేపట్టనున్నారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ బ్యాంక్ క్లర్క్ ఎంపిక జరగనుంది. ఈ వెకన్సీలకు సంబంధించిన వివరాలు వెల్లడవుతాయి. అక్టోబర్ -నవంబర్ 2024 మధ్యలో దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నారు.
అర్హత.. ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వయస్సు 20-28 మధ్యలో ఉండాలి. ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు విధానాల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నారు. పరీక్ష రుసుము రూ. 750 జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి వర్తిస్తుంది. అధికారిక వెబ్‌సైట్ https://sbi.co.in/web/careers/ ద్వారా అప్లై చేసుకోవాలి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తులో సరైన వివరాలను ఫోటో, సంతకంతో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పరీక్ష రుసుము చెల్లించాలి. కేవలం అర్హత గల అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.