Naga Panchami 2022:  శ్రావణ మాసంలోని శుక్ల పక్షం ఐదో రోజున నాగ పంచమి పండుగ జరుపుకుంటారు. ఇవాళే నాగ పంచమి. ఈ రోజున నాగదేవతను పూజిస్తారు. ఇతరుల చెడు దృష్టి మన ఇంటిపై పడకుండా ఉండాలంటే మహిళలు నాగపంచమి (Naga Panchami 2022) రోజు కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. అంతేకాకుండా నాగ పంచమి రోజు నాగదేవతను పూజించేటప్పుడు ఈ మంత్రాలు పఠించడం వల్ల ప్రజల సమస్యలన్నీ తీరిపోతాయి. అంతేకాకుండా మీ దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ మంత్రాల గురించి తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నాగ పంచమి పూజ మంత్రం
సర్వే నాగా: ప్రియాంతన్ మే కేచిత్ పృథ్వీతలో.
యే చ హేలిమరీచిష్ఠా యంత్రే దివి సంస్థితా:॥
యే నదీషు మహానాగా యే సరస్వతీగామినః ।
యే చ వాపితాడ్గేషు తేషు సర్వేషు వై నమః॥ 
మంత్రార్థం - ఈ ప్రపంచంలో ఆకాశం, స్వర్గం, సరస్సులు, బావులు, చెరువులు మరియు సూర్యకిరణాలలో నివసించే సర్పాలు మమ్మల్ని ఆశీర్వదించండి. 


అనన్తం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలమ్ ।
శంఖ పాలం ధృతరాష్ట్ర తక్షం కాళీయమ్ తథా
ఏతాని నవ నామాని నగానాన్ చ మహాత్మానమ్ ।
సాయంకాలే పఠేన్నిత్యం ప్రాత:కాలే విశేషతహ:
తస్య విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్
మంత్రం అర్థం - తొమ్మిది సర్ప దేవతల పేర్లు అనంత్, వాసుకి, శేష, పద్మనాభ, కంబల్, శంఖపాల, ధృతరాష్ట్ర, తక్షక్ మరియు కాళియ. వీటిని రోజూ ఉదయాన్నే క్రమం తప్పకుండా జపిస్తే సర్వపాపాల నుండి విముక్తి లభిస్తుంది.


Also Read: Diwali 2022: దీపావళి తర్వాత రోజే సూర్యగ్రహణం.. తేదీ, శుభ సమయం తెలుసుకోండి!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook