Naga Panchami Date: నాగపంచమి తేదీ, పూజా సమయం ఎప్పుడు, ఏం చేయకూడదు
Naga Panchami Date: హిందూమతంలో నాగపంచమికి విశేష ప్రాధాన్యత ఉంది. కుండలిలో కాలసర్ప దోషముంటే దూరం చేసేందుకు ప్రత్యేక పూజలు చేస్తారు. అదే సమయంలో మీరు చేసే పొరపాట్లు జీవితాంతం వెంటాడుతాయి.
Naga Panchami Date: హిందూమతంలో నాగపంచమికి విశేష ప్రాధాన్యత ఉంది. కుండలిలో కాలసర్ప దోషముంటే దూరం చేసేందుకు ప్రత్యేక పూజలు చేస్తారు. అదే సమయంలో మీరు చేసే పొరపాట్లు జీవితాంతం వెంటాడుతాయి.
నాగపంచమి ఈ ఏడాది ఆగస్టు 2వ తేదీ మంగళవారం వస్తోంది. నాగ పంచమి నాడు నాగదేవతను పూజించడమే కాకుండా..పాలు అర్పిస్తారు. శ్రావణమాసంలోని శుక్లపక్షం పంచమి రోజున ఈ పండుగ జరుపుకుంటారు. నాగదేవతను దేవీ దేవతలుగా పూజిస్తారు. అందుకే ఈ నాగ పూజ. అటు శివుడు కూడా పామును మెడలో ధరించి కన్పిస్తారు. అటు విష్ణు భగవానుడు కూడా శేషశయనంపైనే విశ్రమిస్తుంటారు. నాగపూజ చేయడమే కాకుండా..కొన్ని పొరపాట్ల నుంచి కాపాడుకుంటే..నాగదేవత ఆగ్రహానికి గురి కాకుండా ఉంటారు.
నాగపంచమి అనేది పాముల్ని ప్రసన్నం చేసుకునేందుకు అనువైన సమయం. నాగపంచమి రోజున వ్రతం ఆచరించాలి. నాగదేవత విగ్రహానికి పూజలు చేయాలి. శివలింగాన్ని అభిషేకించి..నాగదేవత కటాక్షం కోసం ప్రార్ధనలు చేయాలి. ఇలా చేయడం వల్ల శివుడు, విష్ణువు, లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. అదే సమయంలో నాగ పంచమి రోజున కొన్ని పనులకు దూరంగా ఉండాలంటున్నారు పండితులు.
నాగపంచమి రోజున సూది దారం వాడకూడదు. నాగపంచమి రోజున ఇనుప గిన్నెలో అన్నం వండకూడదంటారు. నాగపంచమి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నేల తవ్వకూడదు. ప్రత్యేకించి పాములుండే ప్రాంతాల్ని అస్సలు టచ్ చేయకూడదు. పాముల్ని ఎప్పుడూ చంపకూడదు, హాని కల్గించకూడదు. పట్టుకుని అడవుల్లో వదిలేయాలి.
కుండలిలో రాహుకేతువులు అశుభ స్థితిలో ఉంటే పాముల్ని గాయం చేకూర్చకూడదు. నాగపంచమి రోజున నాగదేవత విగ్రహం లేదా వెండితో చేసిన నాగ నాగిణిలను పాలతో అభిషేకించి..చేసిన పాపాల్ని క్షమించమని వేడుకోవాలి. ఈ జన్మలో లేదా గత జన్మలో పాముల్ని చంపి ఉంటే ఆ పాపాల్ని క్షమించాలని కోరుకోవాలి.
ఈ ఏడాది నాగపంచమి ఆగస్టు 2, 2022 మంగళవారం నాడు ఉంది. నాగపంచమి పూజ చేసే శుభ సమయం ఆగస్టు 2వ తేదీ ఉదంయ 6 గంటల 5 నిమిషాల్నించి 8 గంటల 41 నిమిషాలవరకూ ఉంది.
Also read: Personality by Zodiac: ఈ 5 రాశుల వారు అత్యంత తెలివిగలవారు.. జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook