Naga Panchami 2022: రేపే అంటే ఆగస్టు 2న నాగ పంచమి. ఈ రోజున నాగదేవతను పూజిస్తారు. అంతేకాకుండా ఈ రోజున (Naga Panchami 2022) పాములకు పాలు పోసి.. ఆరాధించడం వల్ల అపారమైన సంపద మరియు ఆశించిన ఫలితాలు లభిస్తాయి. దోషాలు పోగొట్టుకునాలనే వారికి ఈ రోజు చాలా మంచిది. ఇవాళ నాగదేవతను పూజిస్తే.. కాలసర్ప దోషం (Kala Sarpa dosham) నుండి బయటపడటమే కాకుండా..రాహు-కేతువుల యెుక్క అశుభ ప్రభావాలను  తగ్గించవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాహు-కేతువుల పరిహారాలు:
>> నాగ పంచమి రోజున పాముకు ప్రతిరూపంగా ఓ పెద్ద తాడును ఏడు ముడులుగా కట్టి.. పూజా స్థలంలోని ఆసనంపై ఉంచాలి.
>>  నాగదేవతకు పచ్చి పాలు, పూలు, అగరబత్తిలు సమర్పించి గుగ్గిలం ధూపంగా వేయండి.
>> రాహువు యొక్క "ఓం రా రాహవే నమః", కేతువు యొక్క "ఓం కేత్వే నమః" అనే మంత్రాన్ని జపించండి.
>> మంత్రాన్ని పఠిస్తున్నప్పుడు, ఇప్పుడు తాడు యొక్క ముడులను ఒక్కొక్కటిగా తెరవండి. అప్పుడు ఈ తాడును నదిలో వదిలేయండి.
>> రాహు-కేతువుల దుష్ప్రభావాలతో బాధపడేవారు ఈ రోజున నవనాగ స్తోత్రాన్ని పఠిస్తే..ఫలితం ఉంటుంది. అదేవిధంగా చేతి మధ్య వేలుకు వెండి సర్ప ఉంగరాన్ని ధరించడం వల్ల కూడా మేలు జరుగుతుంది. 


పాము భయం పోవాలంటే:
>> నాగ పంచమి నాడు వెండి పామును మరియు ఒక స్వస్తికను పూజించండి.
>> ఒక ప్లేట్‌లో పాము, మరో ప్లేట్‌లో స్వస్తిక ఉంచండి. పాములకు పచ్చి పాలను మరియు స్వస్తికకు బిల్వపత్రాన్ని నైవేద్యంగా పెట్టండి. 
>> శివుడు మరియు సర్ప దేవతను ధ్యానిస్తూ "ఓం నాగేంద్రహరాయ నమః" అని జపించండి.
>> మెడలో స్వస్తికను ధరించడం వల్ల పాము భయం తొలగిపోతుంది.


Also Read: ఈ రోజే శ్రావణ సోమవారం, గణేష్ చతుర్థి, రవియోగం.. శుభ ముహూర్తం, పూజా విధానం



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook