Naga Panchami 2022: శ్రావణ మాసంలో శుక్ల పంచమి నాడు నాగ పంచమిని జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఆగస్టు 02న ఈ పండుగను (Nag Panchami 2022) జరుపుకోనున్నారు. ఈ రోజున భక్తులు నాగదేవతకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆలయాల్లో నాగదేవతకు జలాభిషేకం చేసి పాలు సమర్పిస్తారు. శివ భక్తులు కూడా ఈ రోజు ఉపవాసం ఉంటారు. ఈ రోజున నాగదేవతను పూజిస్తే.. వారి కష్టాలన్నీ తీరుపోతాయని నమ్ముతారు. నాగ పంచమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నాగ పంచమి ప్రాముఖ్యత
హిందువులకు నాగ పంచమికి చాలా ప్రత్యేకమైన పండుగ. నాగ పంచమి రోజున జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు, పొలాల్లో పంటల రక్షణ కోసం నాగ దేవతను పూజిస్తారు. ఈ రోజున పరమేశ్వురుడిని ఆరాధించి..రుద్రాభిషేకం చేస్తే.. మీ జాతకంలోని కాలసర్ప దోషం తొలగిపోతుంది. ఈ రోజు సర్పాలకు అభిషేకం చేసి పాలు నైవేద్యంగా పెడితే మీకు పుణ్యం లభిస్తుంది. నాగపంచమి రోజున ఇంటి వెలువల పాము విగ్రహాన్ని పెడితే నాగదేవత ఆశీర్వాదం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. 


ఈ రోజున చేయవలసినవి మరియు చేయకూడనివి
>> నాగపంచమి నాడు ఉపవాసం పాటిస్తూ..నాగదేవతను పూజించండి. అంతేకాకుండా ఆ దేవతకు జలాభిషేకం చేయండి. పువ్వులు మరియు పాలు సమర్పిచండి. ఆ తర్వాత నాగ మంత్రాన్ని జపించండి. 
>> జాతకంలో రాహు కేతువులు ఉంటే నాగ పంచమి నాడు పాములను పూజించండి. శివలింగం లేదా నాగదేవతకు పాలు ఇత్తడి పాత్రలో సమర్పించండి. 
>>  నాగ పంచమి నాడు సూది దారాన్ని ఉపయోగించడం కూడా అశుభంగా భావిస్తారు. ఈ రోజున ఇనుప పాత్రలలో ఆహారాన్ని వండకూడదు.


Also Read: Venus Transit Effect: శుక్ర సంచారం ఎఫెక్ట్.. రాబోయే 12 రోజులు ఈ 3 రాశులవారికి డబ్బే డబ్బు..!



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook