Naga Panchami 2022: శ్రావణ మాసంలోని శుక్ల పక్షం ఐదవ రోజున నాగపంచమి జరుపుకుంటారు. ఈసారి పంచమి తిథి 2 ఆగస్టు 2022 నాడు వచ్చింది. అదే రోజు శ్రావణ సోమవారం రావడం విశేషం. ఈ రోజన శివపార్వతులతోపాటు నాగదేవతను కూడా పూజిస్తారు. నాగపంచమి (Naga Panchami 2022) రోజున నాగదేవతను పూజించడం వల్ల నాగదేవత మరియు శివుడు ఇద్దరి ఆశీస్సులు లభిస్తాయి మరియు జీవితంలోని అనేక కష్టాలు తొలగిపోతాయి. కాల సర్ప దోషం, అకాల మృత్యుభయం ఉన్నవారు నాగపంచమి రోజున తప్పనిసరిగా నాగదేవతను పూజించాలి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పూజ ముహూర్తం
ఈ సంవత్సరం నాగపంచమి ఆగష్టు 2వ తేదీ మంగళవారం వచ్చింది. ఉదయం 06:05 గంటల నుండి 08:41 గంటల వరకు పూజ చేసుకోవడానికి మంచి సమయం. పంచమి తిథి ఆగస్టు 2వ తేదీ ఉదయం 05:13 గంటలకు ప్రారంభమై ఆగస్టు 3వ తేదీ ఉదయం 05:41 వరకు ఉంటుంది. 


నాగదేవతను ఎలా పూజించాలి?
నాగపంచమి రోజున కూడా ఉపవాసం ఉంటూ..నాగదేవతకు పూజచేస్తారు. కొంతమంది ఒక్క పూట భోజనం చేసి మిగిలి రోజంతా ఉపవాసం చేస్తారు. కాల సర్ప దోష నివారణను పూజ చేయాలి.  నాగదేవత చిత్ర పటాన్ని లేదా విగ్రహాన్ని పెట్టి పూజ చేయండి. పువ్వులు సమర్పించి.. ధూపం వేయండి. పచ్చి పాలు, పంచదార పెట్టండి. నాగదేవత కథ తప్పక చదవండి. చివరికి నాగదేవత హారతినిచ్చి పూజను ముగించండి.  


Also Read: Gajakesari yoga: తొలి శ్రావణ సోమవారం నాడే గజకేసరి యోగం.. ఈ 5 రాశులవారికి గోల్డెన్ డేస్ మెుదలు..



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook