Nagula Chavithi 2022: నాగుల చవితిని ఘనంగా జరుపుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు సిద్దమయ్యారు. ప్రతి ఏటా ఈ పండుగను కార్తీక శుద్ధ చతుర్థి నాడు జరుపుకుంటారు. ఈ ఏడాది నాగుల చవితిని (Nagula Chavithi 2022) ఈ రోజు అంటే అక్టోబరు 29, శనివారం నాడు చేసుకోనున్నారు. ఉదయం 10:30 గంటల లోగా పుట్టల వద్దకు కుటుంబ సమేతంగా వెళ్లి పూజలు చేసేందుకు ప్రజలు రెడీ అవుతున్నారు. ఈ ఫెస్టివల్ సందర్భంగా కోడిగుడ్లు, పూజాసమాగ్రి, పూలు, పండ్లు ధరలు అమాంతం పెరిగాయి. అయినా సరే ప్రజల కొనుగోళ్లు చేస్తున్నారు. ఈరోజున ప్రజలు ఇంట్లో నాగదేవత విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేస్తారు. మరికొందరు పుట్టవద్దకు వెళ్లి నాగారాధన చేస్తారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నాగుల చవితి రోజు ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజ చేస్తారు.అనంతరం చలిమిడి, అరటిపళ్ళు, తాటి బుర్రగుంజు, తేగలు మెుదలైనవి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ సందర్భంగా పుట్టవద్ద దీపావళి నాడు మిగిలిన కాకరపువ్వొత్తులు, టపాసులు మొదలైనవి కాలుస్తారు. హిందువులు నాగపామును దేవతగా కొలుస్తారు. మన పురాణాల్లో కూడా నాగుల చవితికి సంబంధించి ఎన్నో కథనాలు ఉన్నాయి. మనలో ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విష గుణాలు పోవాడానికి విషసర్పాల పుట్టల వద్దకు వెళ్లి పాలు పోయాలని పురాణ కథనం ఒకటి చెబుతోంది. 


నాగల చవితి నాడు నాగ దేవతను పూజిస్తే సర్వరోగాలు పోతాయని భక్తులు నమ్ముతారు. అంతేకాకుండా ఈరోజు సంతానం లేని దంపతులు నాగారాధన చేస్తే.. పిల్లలు కలుగుతారని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. నాగదోషం, రాహు-కేతు దోషాలు ఉన్నవారు నాగుల చవితి రోజున నాగేంద్రుడిని పూజిస్తే దోషాలన్నీ తొలగిపోతాయి. ఇవాళ నాగరాజును భక్తిశ్రద్ధలతో ఆరాధించి మనసులో ఏదైనా బలంగా కోరుకుంటే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుందని ప్రజల నమ్మకం. 


Also Read: Budh Gochar 2022: బుధుడి సంచారం.. నవంబరు 13 వరకు ఈ రాశుల వారికి కష్టకాలం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి