Nagula Chaviti 2022: దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థి నాడు నాగుల చవితి పండుగను జరుపుకుంటారు.  కొందరు శ్రావణ శుద్ధ చతుర్థి నాడు కూడా నాగుల చవితిని చేసుకుంటారు. ఈ ఫెస్టివల్ సందర్భంగా పుట్టకు పూజలు చేస్తారు. ఈ ఏడాది నాగుల చవితిని (Nagula Chaviti 2022) కొందరు అక్టోబరు 28న, మరికొందరు అక్టోబరు 29న జరుపుకుంటున్నారు. ఈ పండుగను ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక ప్రాంతంలోనూ జరుపుకుంటారు. నాగదోషం, రాహు-కేతు దోషాలు ఉన్నవారు ఈ రోజున నాగారాధన చేస్తే అవన్నీ తొలగిపోతాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పూజ ఎలా చేస్తారు?
నాగుల చవితిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా జరుపుకుంటారు. కొందరు ఇంట్లోనే నాగప్రతిమను ప్రతిష్టించి పూజ చేస్తే... మరికొందరు పుట్ట దగ్గరికి వెళ్లి పూజలు చేస్తారు. ఫెస్టివల్ రోజు ఉదయాన్నే  ముందుగా తలస్నానం చేసి.. కొత్త బట్టలు ధరిస్తారు. తర్వాత నువ్వులు, బెల్లం  కలిపిన చలిమిడి తయారు చేస్తారు. అనంతరం పుట్ట దగ్గరికి వెళ్లి షోడశోపచారలతో నాగదేవతకు పూజ చేస్తారు. కోడిగుడ్లు, చలిమిడి, పాలును పుట్టలో పోస్తారు. తర్వాత దీపం వెలిగించి ధూపం వేస్తారు. పుట్ట మీద ఉన్న మట్టిని తీసుకుని కన్నులకు, చెవులకు రాసుకుంటారు. అంతేకాకుండా పుట్ట వద్ద దీపావళి (Diwali) నాడు మిగిలిన మతాబులు, కాకరపువ్వొత్తులు, టపాసులు మొదలైనవి కాలుస్తారు. 


నాగుల చవితి విశిష్టత
>> నాగులచవితి రోజున నాగదేవతను ఆరాధించడం వల్ల జాతకంలో రాహు-కేతు దోషాలు తొలగిపోతాయి.
>> ఈ రోజున నాగారాధన చేయడం వల్ల సర్పదోషం తొలగిపోయి.. శుభఫలితాలు కలుగుతాయి.
>> మీ జాతకంలో పితృదోషం ఉన్నవారు నాగ పూజ చేయడం మంచిది. 
>> ఈ పూజను చేయడం వల్ల మీకు ఎటువంటి సమస్యలున్నా, వ్యాధులన్నా, బాధలున్నా దూరమవుతాయి. 
>> ఈ చవితిని జరుపుకోవడం వల్ల సంతానం లేని వారికి పిల్లలు కలుగుతారు. 


Also Read: Karthika Masam 2022: కార్తీకమాసంలో ఈ శివాలయాలను సందర్శిస్తే.. సంతాన సమస్యలు దూరమవుతాయి.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి